మహమ్మారితో కలిసి ఉగ్రవాదులొస్తున్నారు జాగ్రత్త.. హెచ్చరించిన ఐరాస

కరోనా మొదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర నష్టం మన చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కరోనా మహమ్మారి ఉగ్రవాదుల చేతిలో ఆయుధం గా మారె అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన (యునైటెడ్ నేషన్స్ ఇన్టర్ రీజినల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ) యూఎన్ఐసీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

ప్రపంచంలోని కొన్ని విచ్ఛిన్నకర ఉగ్ర శక్తులు కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని, ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సరికొత్త కుట్రకు తెర తీస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ హెచ్చరించింది. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు తమకు కరోనా సోకేలా చేసుకుని తరువాత వైరస్ బాంబుల్లా తయారవుతున్నారని పేర్కొంది. ఆపై వారు మాస్క్ లు ధరించకుండా జనసమూహాల్లోకి వెళ్లి బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటి చర్యలకు పాల్పడతారని, దీని ద్వారా ప్రజల్లో ఈ మృత్యుకారక వైరస్ మరింత వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నారని  వివరించింది. ఈ రకమైన కొత్త కొత్త దాడులను ఉగ్రసంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ విధమైన కుట్ర సిద్ధాంతాల ప్రచారం కోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారని తన నివేదికలో తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu