విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుపై 'సిట్'... నిగ్గుతేల్చేందుకే..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా కేసును  సీబీఐ.. ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఇంకా వేగవంతం చేయడానికి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ పలు కీలక సమాచారాలు సేకరించగా.. ఇప్పుడు సిట్ తో దర్యాప్తు ఇంకా తేలికవుతుందని భావిస్తున్నారు.

 

 

మరోవైపు కాంగ్రెస్ పార్టీని.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇరుకున పెట్టిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుపై దర్యాప్తును కూడా సిట్ కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ఈడీ విచారించింది. మరి సిట్ దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.