విడుదలయ్యాక నోరు విప్పిన కవిత

తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత తొలిసారి రాజకీయాలపై స్పందించారు. తెలంగాణ రాజకీయాలపై కాకుండా జాతీయ రాజకీయాలపై స్పందించారు.
సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు ఆదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్​ వేదికగా స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా, ఆడబిడ్డను అరెస్టు చేయడం మోదీ సర్కార్​కు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా అని ప్రశ్నించారు.
 ఆదానిపై ఆరోపణలు కొత్తేమీ కాదు అయినా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించిందన్నారు. 164 జైలు జీవితం గడిపిన కవిత  నోరు విప్పడం చర్చనీయాంశమైంది.