సజ్జలకు సుప్రీంలో చుక్కెదురు

వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్  సజ్జల భార్గవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. 
వైకాపా హాయంలో సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వారిపై ఇటీవల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందులో భాగంగా వైకాపా సోషల్ మీడియా  కన్వీనర్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలని సజ్జల భార్గవ్ సుప్రీం కోర్టు నాశ్రయించారు. అయితే కేసుల అంశం హైకోర్టులోనే  తేల్చుకోవాలని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.  అలాగే సజ్జల పిటిషన్ తిరస్కరించింది. 
 సజ్జల తరపున కపిల్ సిబల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. పాత కేసులను తిరగదోడి కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారని కపిల్ సిబాల్ సజ్జల తరపున వాదించారు.   మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సిద్దార్థ  ప్రభుత్వం తరపున లూద్రా వాదించారు.