600 కేజీల బర్త్ డే కేక్.. లారీపై ఊరేగింపు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం డిసెంబర్ 21( బుధవారం). ముఖ్యమంత్రిగా ఆయన జరుపుకుంటున్న నాలుగో పుట్టిన రోజు. అదే కాదు.. ఈ ఏడు ఆయన జరుపుకుంటున్న పుట్టిన రోజుకు మరో ప్రత్యేకత ఉంది అదేమిటంటే..   ఆది ఆయన 50వ జన్మదినం.

దీంతో వైసీపీ శ్రేణులు రెండు రోజుల ముందు నుంచే సంబరాలు ఆరంభించేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఆటల, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. అన్నిటికీ మించి ఆయన బర్త్ డే సందర్బంగా 600 కేజీల కేక్ తయారు చేయించి దానికి లారీపై ఊరేగించారు.

గొల్లపూడిలోని మైలురాయి సెంటర్ లోని బాబూ జగజ్జీవన్ రాం విగ్రహం నుంచి గ్రామ సచివాలయం వరకూ లారీపై ఊరేగించి అనంతరం కేక్ ను కట్ చేశారు.  ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu