ఇరాక్‌లో 40 మంది భారతీయుల కిడ్నాప్
posted on Jun 18, 2014 5:41PM
.jpg)
ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధ ప్రభావం అందరూ భయపడుతున్నట్టుగానే ఇండియా మీద కూడాపడింది. ఇరాక్‌లో భారతదేశానికి చెందిన 40 మంది కిడ్నాప్ అయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ బుధవారం నాడు ప్రకటించింది. ఇరాక్‌లోని మెసూల్‌లో వున్న ఉర్ అల్ హూద్ కంపెనీలో పనిచేస్తున్న 40 మంది భవన నిర్మాణ కార్మికులు కిడ్నాప్ అయ్యారని, కిడ్నాప్ అయినవారు ఉత్తర భారతదేశానికి చెందినవారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికులను ఎవరు అపహరించారన్న విషయంలో ఇంకా ఎలాంటి సంకేతాలు అందలేదు. అయితే అపహరణకు గురైనవారిని కాపాడటానికి చర్యలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే ఇరాక్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన 46 మంది నర్సులు ఇండియాకు వచ్చేయాలని కుంటున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.