కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

 

కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగింది.

ఇప్పటికే నలుగురి మృతదేహాలను బయటకు తీశారు సిబ్బంది. వారిని నిజామాబాద్ వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి ముఖ్య కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వారు నిజామాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ లోని తమ బంధువులకి ఏయిర్ పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి నిజామాబాద్ కి బయలు దేరారు. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీళ్లంతా కూడా నిజామాబాద్ వాసులుగా చెప్తున్నారు. డ్రైవర్ ప్రశాంత్ మాత్రం నవీపేట వాసిగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత హైవే పెట్రోలింగ్ వాళ్ళు చేరుకున్నారు. తరువాత పోలీసులు చేరుకొని గ్యాస్ కటర్ ద్వారా అద్దాలను కట్ చేసి మృతు దేహాలను బయటకి తీశారు. మృతదేహాలు నలుగురిని కూడా పోస్టుమార్టంకు తరలించారు. కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యినట్లు పోలీసులు వెల్లడించారు.