ఉదయం 11 గంటల వరకూ 20.64శాతం పోలింగ్.. ఓటేసేందుకు కదలని హైదరాబాద్ వాసులు

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహంగా కదులుతున్నా.. పట్టణ ప్రాంతాలలో మాత్రం ఓటర్ల నిర్లిప్తత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ జిల్లాలో ఉద్యం 11 గంటలకు కేవలం 12.39 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి 20.64శాతం ఓట్లు పోలయ్యాయి.  ఖమ్మం జిల్లాలో తొలి నాలుగు గంటలలో 21 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సరళిపై తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందిస్తూ పట్టణ ఓటర్లు పోలింగ్ బూతులకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరగాల్సి ఉందని అన్నారు.  ఇప్పటి వరకూ సిద్ధిపేటలో అత్యధికంగా 30శాతంవ  ఓట్లు పోలయ్యాయి. అలాగే దుబ్బాకలో 29శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా ఉందని పలువురు అభిప్రాయపనడుతున్నారు.  నగరవాసుల తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. ఇప్పటికైనా నగర వాసులు కదిలి వచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News