చనిపోయిన శవాన్ని బైక్ కు కట్టుకొని..
posted on May 31, 2016 12:57PM
భువనేశ్వర్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఓ శవాన్ని బైక్ కు కట్టుకొని వెళుతున్నఘటన అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల ప్రకారం.. భువనేశ్వర్ భారాముండా గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని మరణించింది. అయితే ఆమె మృత దేహానికి పోస్ట్ మార్టం చేసిన తరువాత.. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. అలా ప్యాక్ చేసిన మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు బైక్ వెనుకాల కట్టుకొని తీసుకెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక వారు అలా చేశారా? లేక వాహనంలో తరలించేందుకు అవసరమైన డబ్బులు లేక అలా చేశారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
మరోవైపు దీనిపై జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా స్పందించి.. ఆ చుట్టుపక్కల 20కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని.. మృతదేహాలను తరలించేందుకు వీలుగా పేదలకోసం వీటిని అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు.