నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్

 

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే 3,038 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌న్నారు. వీటిలో డ్రైవర్-2,000, శ్రామిక్స్-743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)-84, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్-25, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)-23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్-15, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)-11, మెడికల్ ఆఫీసర్ (జనరల్)-07, మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)-07, అకౌంట్స్ ఆఫీసర్-06 పోస్టులు ఉన్నాయ‌ని మంత్రి పొన్నం పేర్కొన్నారు 

తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్​ క్యాలెండర్​ను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్​ 1,2,3,4 పోస్టులతోపాటు.. పోలీస్, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్‌లు వెలువడనున్నాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu