టిడిపి ‘ప్రజాగర్జన’
posted on Nov 20, 2013 11:29AM
.jpg)
రాష్ట్రంలో ఏప్రిల్ లో శాసనసభతో పాటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. తిరుపతి నుంచి ఈ నెల 21న ప్రారంభించన్ను సభలకు ’ప్రజాగర్జన’ అని పేరు పెట్టారు.
చంద్రబాబు నాయుడు 'ప్రజాగర్జన' పేరుతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో బహిరంగసభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్, జగన్ అవినీతి, కుట్రాలపై ఈ సభలలో నిప్పులు చేరగానున్నారు. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ రెండో రోజు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కుప్పంలో జగన్మోహన్‌రెడ్డిని అడుగుపెట్టకుండా చూడాలని ప్రజలను కోరారు. కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డితో కాంగ్రెస్‌కలిసి రాష్ట్రాన్ని భ్రస్టుపట్టించారని ఆరోపించారు. తమ రాజకీయ లబ్ధికోసం రాష్ర్ట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు.