కేసీఆర్ కు షాక్... రేవంత్ వద్గకు టీఆర్ఎస్ నేత...
posted on Oct 30, 2017 6:19PM

రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పడైతే రేవంత్ రెడ్డి టీడీపీని విడాడో.. అప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నేతలు ఎవరు.. ఎప్పుడు షాకిస్తారా అని టెన్షన్ పడుతున్నారట. ఇక వాళ్లు కంగారు పడినట్టే ఓ టీఆర్ఎస్ నేత కేసీఆర్ షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. రేవంత్ పార్టీ మారాక తాజాగా తొలిసారిగా తన నివాసంలో తన అభిమానులు, అనుచరులతో పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి.. వరంగల్ జిల్లా టిఆర్ఎస్ నేత దొమ్మటి సాంబయ్య ఆత్మీయ సమావేశానికి హాజరుకావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఈయన కూడా రేవంత్‌తో పాటు కాంగ్రెస్ చేరతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్‌కు ఇది అదిరిపోయే షాక్‌గానే చెప్పాలి. ఏదేమైనా వరంగల్ టీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న సాంబయ్య ఈ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది.