మైక్రోసాఫ్ట్: 18 వేల ఉద్యోగాలు హూస్ట్!

 

2015 నాటికల్లా దాదాపు 18 వేల మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. వీళ్లలో 12,500 మంది ఆమధ్య మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసిన నోకియా పరికరాలకు సంబంధించిన వాళ్లు. వీళ్లందరికీ త్వరలోనే పింక్స్లిప్పులు అందుతాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మొత్తం ఉద్యోగులందరికీ లేఖలు పంపారు. సంస్థలో ఎక్కువగా వున్న ఉద్యోగులను తగ్గించుకుని ఉత్పాదకత సాధించే దిశగా వెళ్లడంలో భాగంగానే ఈ ఉద్యోగుల తొగింపు అని సత్య నాదెండ్ల తన లేఖలో తెలిపారు. అయితే.. ఉద్యోగులను తొలగించే విధానం మాత్రం చాలా పారదర్శకంగా సాగుతుందని నాదెళ్ల తెలిపారు.ఇలా ఉద్యోగాలు కోల్పోయేవారికి జాబ్ ట్రాన్సిషన్ అసిస్టెన్స్ పేరుతో కొంతకాలం పాటు సాయం కూడా అందిస్తామని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu