గోపీనాధ్ ముండే మృతి పట్ల బాబు, కేసిఆర్ సంతాపం

 

 

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి గోపీనాధ్ ముండే మృతి పట్ల పలువురు ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్, సీమాంధ్ర కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముండే మృతి పట్ల సంతాపం తెలిపారు. టిడిపి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు.. బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ ఎంపీలు రాయపాటి, గల్లా జయదేవ్, కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, మల్లారెడ్డిలు సంతాపం తెలిపారు. తెలంగాణ సాధనలో ముండే కీలకపాత్ర పోషించారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu