వైఎస్ కు రూ. 500 కోట్లు ఇచ్చిన గాలి..!
posted on Mar 12, 2013 5:32PM

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల ఫండ్‌గానూ గాలి జనార్ధన్‌రెడ్డి వైఎస్‌కు రూ. 500 కోట్లు ఇచ్చారని వార్తలు వస్తున్నాయని పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని గాలి జనార్ధన్‌రెడ్డి సీబీఐ ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసిందని అన్నారు. ఆ డబ్బు వైఎస్ ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారని కేశవ్ అరోపించారు. సీబీఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టుకు వస్తుందని పయ్యావుల పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని కేశవ్ డిమాండ్ చేశారు. కాగా ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌రెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.