మంత్రి పదవికి రాజీనామా.. హాట్ టాపిక్ ఇదే..

 

 

ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఇది ఢిల్లీలో హాట్ టాపిక్ అయింది. మంత్రి గారు రాజీనామా చేయడానికి.. అందరూ చర్చించుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారా..? ఎందుకంటే బస్సుల కుంభకోణంలో గోపాల్‌ రాయ్‌ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో గోపాల్ రాయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు గోపాల్ రాయ్ మాత్రం అనారోగ్యం కారణంగానే రవాణా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే గోపాల్ రాయ్ మెడలో ఉన్న బుల్లెట్ను వైద్యులు తొలగించారు. దీంతో ఆయన ఏడాది పాటు పక్షవాతానికి కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో తాను విశ్రాంతి తీసుకోనున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు.  కాగా గోపాల్ రాయ్ స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ...రవాణా శాఖ బాధత్యలను స్వీకరించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu