దాసరి కి సీపీఐ నారాయణ సపోర్ట్
posted on Jun 22, 2013 4:49PM
.jpg)
బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కానీ ఆయనను వదిలి మాజీ మంత్రి దాసరి నారాయణరావు మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నారాయణ ప్రశ్నించారు. కేజీ బేసిన్ లో రిలయన్స్ గ్యాస్ దోపిడీ చేస్తుందని, భారత ప్రభుత్వాలు రిలయన్స్ కు దాసోహం అవుతున్నాయని ఆరోపిస్తూ సీపీఐ రిలయన్స్ ముందు ఆందోళన చేసింది. ఆ సంధర్భంగా ఆయన దాసరికి మద్దతుగా మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో ఇటీవల దాసరి నారాయణరావును విచారించిన సీబీఐ ఇటీవల ఆయనకు చెందిన సంస్థల మీద, జిందాల్ కార్యాలయాల మీద సోదాలు జరిపి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దాసరికి మద్దతుగా ఎవరూ నిలవలేదు. అయితే ప్రత్యక్ష్యంగా ఇప్పుడు సీపీఐకి చెందిన రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరోక్షంగా అండనివ్వడం విశేషం.