Previous Page Next Page 
పాదాభివందనం పేజి 3

నయనాభిరామంగా కనిపించింది. భువనకి. ఇంత అందం దాచుకున్న ఈ చెరువుని తను ఇన్నాళ్ళూ చూడలేదా? ఇక్కడికి బదిలీ అయి వచ్చి నాలుగేళ్ళయింది! ఏమనగా ఇటు రాలేదు. వచ్చే అవసరంలేదు. అవకాశమూ లేదు.

"మనుషులు తమ చుట్టూరా ఉన్న అందాన్ని చుదలేరేం! ఎక్కడో అందాలున్నాయని భ్రమపడి వాటికోసం పరుగెడతారేం!"

'నమస్తే' ఉలికి పడింది భువన. మేళవించిన వీణ పైరిషభం మోగినట్టుగా ఉందా గొంతు. కోయిల గండుషించినట్టుగా ఉందా పిలుపు. మగతనం రాచఠీవి, సరమధురి, రసజీవం రాగభావన కలబోసినట్టుగా ఉందా సరం. చప్పున తిరిగి చూసింది.

అందం ఆకృతి దాల్చినట్టుగా గాంధార విద్య కదలి వచ్చినట్టు ఉన్నాడతను. పైరుగాలికి చెల్లా చెదురుగా పరిగెత్తే మేఘమాలికల్లాంటి ముంగురులు నుదుటి మీద నర్తిస్తున్నాయి. సితారా శ్రుతి చేసినట్టిగా ఉండే నాసిక, పారాణి అద్దినట్టుండే పెదాలు ప్రేమ భాష్యాలకుగనులుగా ఉన్నట్టున్న కళ్ళు నునుపైన చెక్కిళ్ళు.

క్షణంపాటూ తనని, తన వయస్సుని, తన హోదాని, తన మనస్సుని మరచిపోయింది 'నమస్కారం' మళ్ళీ అన్నాడతను. కోవెల్లో ధజస్తంభం పై కోయిల వాలితే కలిగేరు చిరు మువల సవడి.

'నమస్కారం' తడబాటుగా, ఏనాడు తడబాటు ఎరుగని భువన అంది.

"మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా?"

'వూ! వూ! ఉహూ' పురి విప్పని నెమలిలా గొంతువిచ్చుకోవటం లేదు.

ఎన్నడూ ఇంత అందాన్ని చూడలేదా? ఉలికి పాటుతో అతని వైపు చూసిందామె. ఆ కళ్ళల్లో కొంటేదనం లేదు. ఆ కలువలు చూడండి! దారి తెలియని ప్రేమసారుల్లా లెవూ! అన్నాడు. ఆ కంఠంలో ఉదేగం ఉంది. భావుకత ఉంది. మీరేం చేస్తారు? అడిగింది.

పొలిసు శాఖలో---

"చప్పున మరోసారి చూసింది. మరుభూమిలో మల్లెతీగలా! ఉప్పు నీటి భావిలో అమృతపు వుటలా! కాకి గుంపులో కోకిలా రవములా!

'ఆశ్చర్యంగా ఉందా మీకు! నేను అనుకున్నదోకటి! కర్తవ్యపాలనకి ఏదయితేనేం' అనుకుని చేరిపోయాను.

'అదృష్టవంతులు-'

'ఎందుకు?' ఆ గొంతులో కొద్దిగా కుతుహలం.

'ఉద్యోగానికి మనస్సమ్ముకోలేదు. బానిసత్వం బానిసత్వం అంటారు. కానీ మనవాళ్ళకి ఇంకా ఈ మానసిక బానిసత్వం పోలేదు. గోడ్లలా చాకిరీ చెయ్యటం, డబ్బు సంపాదించటం, దాచుకోవటం సుఖం అనుకుని సుఖం కాని వెనుకపరిగెత్తటం...."చప్పున ఆగిపోయింది. 'క్షమించండి కొత్త వారయినా రాగరంజిత మనస్సులని, బావుకులని మాట్లాడేను' అంది క్షమాపణగా.

చిన్నగానవ్వేడతను. ముద్ద మందారాలు విచ్చుకున్నట్టుగా అతని పెదాలు విచ్చుకున్నాయి. మా వారు చెప్పింది.

"అరె! అయన నాకు బాగ తెలుసు. మా ఇంటికి ఎన్నో సార్లు వచ్చాడు. మరి నన్నోసారయినా మీ ఇంటికి పిలువలేదు. అన్యాయం ఇంత మంచి బావుకత గల మీతో జీవితం పంచుకున్న అయన అదృష్టవంతుడు.

ఆమె గుండెలోంచి వేడి నిట్టుర్పు సెగలా తన్నుకొచ్చింది. తను అదృష్టవంతురాలా!

జన్మజన్మల స్నేహితురాలితో ప్రతి రోజు కలిసి మాట్లాడుకునే ధోరణిలో ఉంది.

"మీరు? చప్పున అడిగింది. అతని ఒక్కొక్క ప్రశ్న తన మనస్సులోని పరిమళాలని వలపు సితారాలపై అతిమనోజ్ఞంగా మంద్రస్థాయిలో వినిపిస్తున్నట్టుగా ఉంది. ఆ హాయి నాకు పాడటంరాదు. కానీ వేణువువాయించగలను. వీణలో పరిచయం ఉంది.

సంగీతమంటే ప్రాణం పెడతాను. సాహిత్యమంటే ఆకలి దప్పులు మరిచిపోతాను. కృష్ణ శాస్త్రి గీతాలు, విశ్వనాధ కిన్నెరసాని పాటలు, బాపిరాజు గేయాలు నాకు చాలా ఇష్టం. క్షేత్రయ్య పద్యాలు విని పరవశిస్తాను తన అంతర రూపం పరిచయం చేసుకున్నాడు.

చీకట్లు మెల్లిమెల్లిగా దిగుతున్నాయి. వెన్నెల మెట్లెక్కి వస్తున్న నెలరాజు, చంద్రికలా నవ్విందామె మెల్లగా.

ఒకప్పుడు పాడేదాన్ని వీణ అభ్యసిస్తూ, త్యాగ రాజసామి కీర్తనలు, అన్నమయ్య పాటలు మీరా భజనలు అష్టపదులు పాడేదాన్ని.

"మూగపోయారా ఇప్పుడు?" 'సంసార భంధం మూగదాన్ని చేసింది'

'ఒక గాయని హత్య చేయబడిందన్న మాట, అతని కంఠంలో కరుకుదనం ద్వనించింది. ;మీ బుద్ది పొనిచ్చుకున్నారు కాదు' చప్పున అంది భువన. వెంటనే నాలిక్కరుచుకుంది తన తొందరపాటుకి.

ఆమె చమత్కారానికతను తేలిగ్గా నేవ్వేశాడు.

'క్షమించండి'

'ఫరవాలేదు సఖ్యం సాప్తదీపం- మనం కలిసి ఏడడుగులు నడవకపోయినా మన మాటలు ఏడు గడియలు కలిశాయి. స్నేహములో తప్పులేదు.

ఇద్దరూ కొన్ని నిముషాల సేపు బాహ్యప్రపంచాన్ని మరచిపోయినట్టుగా మాట్లాడుకున్నారు.

'చీకటి పడింది- వెన్నెల వచ్చింది-' కంగారు పడింది భువన.

'సెలవు- ఇంటికి వెళతాను.'

'నమస్కారం ఎప్పుడైనా రండి. భువనేశ్వర్ తో పాటే."

"మీ ఇల్లాలు.......'

అతని గుండెలో వియోగ వీచికలు హొరుమన్నాయి. అతని ముఖం మ్లనమైంది. గొంతు కొన్ని క్షణాలు మూగబోయింది. 'ఆవిడ లేదు స్మృతిగా ఒక బాబుని వదిలి వెళ్ళింది. పదిహేనేళ్ళయింది. బాబు చదువుకుంటున్నాడు. నేను ఒంటరి వాడిని, తీపి రాగాలు పలకని ప్రేమ సితారా నా జీవితం. అపస్వరాలు పలికే వీణ బ్రతుకు.'

'అయ్యో!' జాలిగా, ప్రేమగా అంది.

'పోనివండి భగవంతుడు అందరికి సుఖాన్ని, సంతోషాన్ని పంచి ఇవడు. కొందరి సొత్తుగా భోగ భాగ్యలని, ఇస్తో, మరి కొందరికి కష్టాలని పంచి ఇవాలి. నాలాటి వాళ్ళు లేకపోతే కష్టాలు ఎక్కడికి వెళతాయి?' ఆమె మనస్సు కరిగి పోయింది.

"మీ పేరు.......

చప్పున తలెత్తి చూసింది- గుండె పలుకు వినిపించేంత తీయని కంఠం. 'భువన- భువన మోహిని- అంతా భువన అనే అంటారు.' 'నా పేరు రజనీ తిలక్- అంతా తిలక్ అంటారు. రెండు జతల కళ్ళు క్షణం పాటు కలుసుకుని విడిపోయాయి.

ఆమె తన ఎద మెత్తధనమంతా వెలికి వచ్చినట్టుగా 'సెలవు- వెళ్లొస్తాను'- అంది.

'నమ్మస్తే' అన్నాడు రజనీ తిలక్. భువన మోహిని ఇంటికి మరలింది. ముందు నడుస్తున్న ప్రియంవద ఆగింది. తనలో తనే ఆలోచించుకుంటున్న భువన మెల్లిగా నడుస్తుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS