Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 4

 

    "అడ్వాన్స్ తెచ్చేశాను."
    ఆమె ముఖంలో నిన్నటి ప్రసన్నత కనిపించలేదు. పావురాయి కళ్ళు మళ్ళీ డేగ కళ్ళయిపోయినాయ్.
    "మీకిల్లు ఇవ్వటం లేదు."
    సురేష్ నవ్వేశాడు.
    "భలే తమాషాలు చేయగలరు మీరు - మీ వారు ఎంతో ఎంజాయ్ చేసి వుంటారు. ,మీ కంపెని........"
    "మీరింక వెళ్ళవచ్చు" తలుపులు మూయబోయిందామె.
    "అరెరే - ఆగండి, ఏమిటది? ఏం జరిగింది?"
    "మీరు చెప్పిన అబద్దలన్నీ బయటపడ్డాయ్."
    "ఎలా?"
    "ఈ పక్కన వాటాలో వుండే అనందరావ్ మిమ్మల్ని చూచారట నిన్న."
    "చూడనీండి! చూస్తే తప్పేముంది? మనం ఇంకా ఏమీ చేయలేదుగా."
    ఆమె ముఖం మళ్ళీ ఎరుపెక్కింది.
    "ఆనందరావుగారు కూడా రిడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్ మెంట్ లోనే పని చేస్తారు. అయన కూడా సర్వేయర్."
    సురేష్ కి అర్ధమయిపోయింది.
    ఇంకా మాట్లాడటం వృధా.
    'ఆనందరావుగారి భార్యను అడిగానని చెప్పండి. ఇద్దరం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం! అసలు ఆమె కోసమే నేనీ ఇంట్లో వుండాలనుకున్నాను - సీక్రెట్ ఎఫేయిర్ కోసం!" వచ్చేశాడతను.
    అతనికి చాలా నిరాశ కలిగింది. తులసిని ఎంతో సుఖ పెట్టాలనుకుంటాడో అంత కష్టపెడుతుంటాడు.
    టైమ్ తొమ్మిదిన్నరయింది.
    పదిన్నరకి ఇంటర్వ్యు , సురేష్ రన్నింగ్ బస్ ఎక్కాడు. సరిగ్గా పదకొండు గంటలకు చేర్చిందక్కడికి.
    "మీరు రావలసింది పదిన్నరకి" అన్నాడు కళ్ళజోడతను కఠినంగా.
    వీడీ కెట్లా దెబ్బకొట్టాలో తనకు తెలుసు. సురేష్ నవ్వాడు.
    "అవును! నేను టైఫాయిడ్ జ్వరంతో పదిహేను రోజుల్నుంచి మంచం మీదున్నాను! డాక్టర్ వెళ్ళొద్దని చెప్పాడు. అయినా వచ్చేశాను."
    "ఐసీ! అయితే అలా నిలబడకండి. కూర్చోండి."
    జాలి!
    "థాంక్యు."
    కుర్చున్నాడతను. పక్కన కూర్చున్న వారంతా తనవంకే చూస్తున్నారు. ఆఖర్లో కూర్చున్న అమ్మాయి కూడా -32-24-30.
    వెంటనే తన పేరు పిలవటం వినిపించింది. ఇదంతా బాగా అలవాటున్న ప్రోసీజరే, అంతా నార్మలె! పిలవటం, లోపల ఇంతర్య్వు చేసే పద్దతి. మార్కులు వేయటం, రికమెండేషన్ వున్న వాళ్ళనే సెలక్టు చేయటం.
    "గుడ్ మార్నింగ్ సర్స్."
    "ప్లీజ్ సిడౌన్."
    కుర్చీలో కూర్చున్నాడు.
    "మీరు పోస్ట్ గ్రాడ్యుయేటా?"
    "అవును! కాపీ కొట్టి పాసయ్యాను......"
    అందరూ తలెత్తి చూశారు అతని వైపు. సురేష్ కు తెలుసు అదంతా అనవసరపు కార్యక్రమం అని. ఉన్న వేకేన్సీలు ఆరొందలు. ఇంటర్వ్యు కి పిలిచింది ఐదువేలమందిని. ఇంతర్య్వు చేసేవాళ్ళు హైదరాబాద్ వాళ్ళే. వాళ్ళ మీద ఎన్నో అవినీతి ఆరోపణలుండేవి. ఇవి చాలు - తను ఈ ఇంతర్య్వు ని 'వినోద వల్లరి' చేసేయడానికి.
    "కాపీ కొట్టావా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    'అవును ఒకటే ఒక్క పేపర్. మిగతావి మా కజిన్ రాశాడు నా పేరుతొ."
    మళ్ళీ నిశ్శబ్దం . మళ్ళీ నోరు తెరవకుండా సైలెన్స్ చేసేశాడు అతను.
    "ఈ ఉద్యోగానికే ఎందుకు రావాలనుకున్నావు?" ఇంకొకరు.
    వీడీ పని పట్టాలి ఇక! వీడూ రెండో ప్రశ్న వేయకూడదు.
    "బ్యాంక్ ఉద్యోగాలయితే ఎక్కువ ఫ్రాడ్ చేయటానికి అవకాశాలుంటాయి కదండీ. వ్యాపారస్థుల దగ్గర ప్రభుత్వం డబ్బుతో మనం వ్యాపారం చేసుకోవచ్చు - మీకు తెలీందేముందీ?"
    ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు.
    మూడో అతను అనుమానంగానే అడిగాడు.
    "నీ హాబీస్ ఏమిటి?"
    దీనికి సరయిన సమాధానం చెప్తే నిజంగా వుద్యోగం ఇచ్చేస్తున్నట్లే ఫోజు.
    "అందమైన అమ్మాయిలను సేకరించడం!" చాప్టర్ క్లోజ్! ఇంక చస్తే మరో ప్రశ్న వేయడు.
    ముగ్గురి ముఖాల్లోనూ కోపం తాండవం చేస్తోంది.
    "యూ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ వే మిస్టర్."
    "నేనలా అనుకోవడం లేదు సార్! నాకు నిజం మాట్లాడటం ఇష్టం. నిజంతో పాటు ఫ్రాంక్ నెస్ ని కూడా యిష్టపడతాను."
    "నేనడిగిన ప్రశ్న మరోసారి విను. నీకు ఎక్కువ ఆసక్తి కలిగించే విషయం ఏది ?" మళ్ళీ అడిగాడు.
    అంటే పాము ఇంకా చావలేదన్నమాట. ఈసారి చావుదెబ్బ కొట్టాలి. మళ్ళీ నోరు విప్పకూడదు.
    "నీకు ఎక్కువ ఆసక్తి కలిగించే విషయం ఏది?" వండ్రఫుల్ ప్రశ్న!
    "సెక్స్!"
    అదిరిపడ్డాడు అతను. కళ్ళల్లో మంట!
    సురేష్ అక్కడితో ఆపలేదు. చిరునవ్వు నవ్వాడు . "ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు పక్కనుంటే మరీ ఆసక్తికరంగా వుంటుంది."
    అయిపొయింది! ముగ్గురూ చేతులెత్తేసినట్లే.
    "దిసీజ్ టూ మచ్."
    "ప్లీజ్ గేటేవే"
    "యూకెన్ గో......"
    సురేష్ బయటికొచ్చేశాడు. చాలా సంతృప్తిగా వుంది అతనికి. వల్చర్స్, లంచాలు, రికమెండేషన్లు. మధ్యలో పూర్స్ ఎవరు? అనేక వేలమంది సురేష్ లు!
    డబ్బూ......రికమెండేషనూ లేని జోకర్లు.
    ఇంటర్వ్యు చేసేవారికి వినోదం కలిగించేందుకు వాడబడే సర్కస్ బఫూన్లు!
    బయట కళ్ళజోడు ఆశ్చర్యంగా పలుకరించింది.
    "చాలా త్వరగా అయిపోయిందే ఇంతర్య్వు."
    "లోపల ఒకాయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది."
    కళ్ళజోడు తెల్లబోయాడు. "అరె మరి చెప్పరేం?" అంటూ లోపలకు పరుగెత్తాడు.
    సురేష్ రోడ్ మీదకొచ్చి నడవసాగాడు.
    బాగా ఆకలి వేస్తోంది. జేబులో అయిదు రూపాయలే వుంది. అంచేత భోజనం మిస్ కొట్టాల్సిందే! ఫస్ట్ తారీఖుకి యింకా రెండు రోజులుంది ఈలోగా మళ్ళీ తులసి దగ్గర డబ్బు తీసుకోవడం తనకిష్టం లేదు. ఇప్పటికే తను ఆమెకో బరువైపోయాడు.
    శ్రీనివాసా రెంటల్ ఏజన్సీకి చేరుకున్నడతను.
    ముసలతను అతన్ని గుర్తుపట్టాడు.
    "ఇల్లు నచ్చిందా?"
    "రెండూ నచ్చినట్లే."
    అయన తనవైపు అనుమానంగా చూడటం గమనించాడు సురేష్.
    "ఏమిటి రెండూ?"
    "ఇల్లూ, ఇంటి ఓనరు గంగాభవానిగారూ" కర్చేఫ్ తో ముఖం తుడుచుకున్నాడతను.
    "లెటజ్ టాక్ ఓన్లీ బిజినెస్...."
    "అయాం టాకింగ్ ఓన్లీ బిజినెస్......."
    "మరి ఇంట్లో దిగుతున్నారా?"
    "దిగనిస్తేగా?"
    "ఎవరు?"
    "గంగాభవానిగారూ......."
    "ఎందుకు?"
    "నేను చెప్పిన నిజాలకూ, ఆమె కనుకున్న సత్యానికి చాలా తేడా వుంది. అదీ గాక ఆమె కట్టుకున్న చీర చాలా సుందరంగా వుంది."
    ముసలాయనకీమీ అర్ధం కావటం లేదు.
    "ఇప్పుడేమిటి చేయటం మరి?"
    "ఇంకో ఇల్లు కావాలి"
    అతను రిజిస్టర్ తిరగేశాడు చిరాగ్గా.
    "అల్ రైట్! కూకట్ పల్లి లో ఇల్లు కావాలా?"
    "సురేష్ ఓ క్షణం ఆలోచించాడు.
    'అక్కడయితే ఫ్రీగా దొరుకుతుంది కదూ?"
    అతను రిజిస్టర్ మూసివేశాడు కోపంగా. "అంతే యింకేం లేవు."
    "అయితే మా పాతిక రూపాయలు యిచ్చేయండి."
    "అదెలా ఇస్తాం?"
    "చెక్ ద్వారా గానీ, క్యాష్ ద్వారా గానీ."
    అతను మళ్ళీ రిజిస్టరు చూశాడు కాసేపు.
    "మీరు చెప్పిన రేటుకి ఓ యిరవై ఎక్కువ అద్దె ఫర్వాలేదా?"
    "ఫర్వాలేదు"
    "అయితే సీతాఫల్ మండి లో వుంది ఓ యిల్లు" అంటూ ఓ ఉత్తరము, ఆ ఇంటి అడ్రస్ కాగితం మీద రాసి యిచ్చాడు.
    బస్ లో సీతాఫల్ మండీ చేరుకున్నాడు సురేష్. అరగంట వెతికాక దొరికిందది. ఇల్లు బయటినుంచి చూస్తూనే అర్ధమయిపోయింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS