Previous Page Next Page 
ఉద్యోగం పేజి 4

అతని కనుకొల్లో నీళ్లు నిలిచాయి.
ఆతర్వాత  అతనొక్కడే బస్టాండుకి వెళ్ళిపోయాడు.    
మొదట్లో  శ్రీనివాసరావుని అపార్ధం చేసుకున్నాను. ఈ వూరికి అలవాటుపడి మావూరిని మరిచిన ఘనుడని భావించాను ఇప్పుడర్దమౌతోంది. శ్రీనివాసరావు ' అనాగరికుడని రాముడెందుకన్నడో.
బార్ ముందు ఆగాను. లోపలికెళ్ళి సీసా కొన్నాను. రీక్షాలో  అద్దెగదికొచ్చాను గదిలో రాముడు ఇంగ్లీషు పొటేదో పాడుతున్నాడు.
                                           *    *    *    *
ఓ ఆదివారం సాయంత్రం రాముడితో పాటు  నౌబత్ పళాద్ కివెళ్ళాను. సాయంత్రం సరదాగా ఖర్చవడానికి అనుకూలమైన స్థలమది. మనసుకి గిలిగింతలుపెట్టే గాలి. అను  కూలమైన  స్థలమది. మనసుకి గిలిగింతలుపెట్టే గాలి. అంత యెత్తునుండి కనుపించే మనోహరదృశ్యమూ ఏమానవుడి  నైనా ఆనందపరచగలని హామి యివ్వచ్చు కొండ మెట్లెక్కుతూండగా  శ్రీనివాసరావు మరో  మనిషితో కనుపించాడు  అతనిపేరు ఫణిభూషణరావుట. మావూరిదగ్గర చిన్న పల్లెటూరట. ఈ నగరానికి  ఉద్యోగరీత్యా వచ్చాట్ట.'
కొండమిద కాసేపు  మేనందరం మాట్లాడుకున్నాం. ఫణిభుషణరావుకి ఇంగ్లాషు సినిమాలమిద వ్యామోహం ఎక్కువని అతని మాటల్లో పసిగట్టాను. సినిమా ప్రపంచానికి సంబంధించినంతవరకూ అతని అభిమాన నటి సోఫియా, అతని అభిమాన నటుడు టోనీకర్టిస్ నూ.
అతను రీజెంటు సిగరెట్టు కాలుస్తాడు. హాస్య ప్రసంగ మంటే అభిమాన ముండొచ్చుగానీ ప్రతి విషయాన్నీ తెలుగులో అనుకుని ఇంగ్లీషులో చెప్పడం మూలంగా వినేవాడికి యిబ్బందేను. వోచిన్న సంఘటన చెప్పాడు.
హైద్రాబాదులో బస్సుదిగి టాక్సీమిద హిమాయత్ నగరం వస్తూండగా దార్లో రోడ్డుకడ్డంగా వో తోరణం కనిపించిందట. దానిమిద  'సేమ్ డే'అని రాసుందిట, ఆ రాత్రి వో ఫ్రండు గదిలో పడుకుని'సేమ్ డే లో నటించిన నడులెవరన్న విషయమై చాలాసేపు ఆలోచించేట్టగానీ  యెంతకీ తేలలేదట. పట్టుదలకొద్దీ ఉదయం పెందరాళే లేచి  రోడ్డుమిదకొచ్చి యీ తోరణం మళ్ళా చూశాట. ఆశ్చర్యమేమిటంటే అది  యే సినిమా ప్రకటనా కాకపోగా ఒకానొక డ్రైక్లీనర్స్ వాళ్ళ హామినట, యిదిచెప్పి నవ్వేడు.  అతని నవ్వుకి శ్రీనివాసరావు శృతికలిపాడు. నేనుగానీ, రాముడు గానీ నవ్వలేదు. దాంతో అతనికి వళ్ళు మండుకొచ్చిందో ఏమో- చివాలున లేచి నిలబడి వస్తానంటూ చెప్పి కదిలాడు' శ్రీనివాసరావు బిక్కిబిక్కుమంటూ మా యిద్దరివేపూ చూచి ఫణిభూషణరావుని అనుకరించాడు.
నేనేదో మాట్లాడబోయాను. నాచెయ్యి నొక్కాడు రాముడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయింతర్వాత అన్నాడు.
"బలేమనిషిని సంపాయించాడు శ్రీను. రాత్రి వేటలో దొరికేడేమె."
"అదేమిటి?"
" అవునోయ్! నీకోసం ఆవాడలావచ్చి ఎలా ప్రేమఒలికించాడో రాత్రి యీ ఫణి గాడ్ని కూడా నెత్తిమిద పెట్టుకొని  ఉండొచ్చుగా"
ఇంత కర్కశంగా మాట్లాడే రాముడిమిద నా కెంతైనా కోపంవచ్చింది.  అందుచేత మాటలాడి చుట్టు ప్రక్కలు చూడటం మొదలెట్టాను; నన్ను గమనించిన రాముడు మాట మార్చాడు.
"ఆఫ్టరాల్ వో చిన్న మనిషి గురించి మన మాటల్ని వేస్టు చేయటం  నాకిష్టం లేదు. మాటాడుకోటానికి చాలా విషయాలున్నాయి. నౌలెట్మిసే సంధింగ్ ఎబౌట్ మిస్ పద్మ. దిమోస్ట్ ఛార్మింగ్లర్ల్!"
ఈ  పద్మెయవరోగాని ప్రాణం తినేస్తుంది. నే నొచ్చిందగ్గర్నుంచీ వాడుచెప్పే ఈ పద్మకథ సశేషంగానే జరుగుతుంది.  ఈ కథకి అంతం యెప్పడు దొరుకుతుందోగాని రాముడినోరు కట్టలేకపోతున్నాను. బొంబాయిలో ఆమధ్య జరిగిన యుకారిస్టు సభల్లో మా రాముడికి పద్మ  అనబడే తెలుగు పిల్లతో కలిగిన పరిచయం గురించి వరసక్రమంగా చెప్పడం వాడికే  చేతకావడేలేదు.
ఆరోజుతో నైనా కథ పూర్తవుతుందనుకున్నాను. ఖర్మంకాలి వర్షంవచ్చే సూచనలు కనుపించడంతో మళ్ళా సశేషం పడ్డది. కొండమెట్లు దిగుతూండగా చిన్నజల్లు ప్రారంభమైంది.
కిందికిదిగి రోడ్డు మిదకొచ్చి బస్సుకోసం ఓ హోటలు ముందు నించున్నాము. మాక్కొచెం దూరంగా వో   అంద మైన మంగలిషాపుముందు శ్రీనివాసరావు  ఒక్కడూ నించున్నాడు. రాముడు వద్దని  హెచ్చరిస్తున్నా గబగబా అతని దగ్గర కెళ్ళాను. రాముడిక్కోపం వచ్చిందో ఏమో రిక్షాఎక్కి వెళ్ళిపోయాడు.
నన్ను చూస్తూనే శ్రీనివాసరావు చిన్నగా నవ్వాడు.
"ఫణిభూషణరావుగారేరి? మిరొక్కరే నించున్నారు?"
" అతను టాక్సీ మిద సినిమా కెళ్ళాడు."
"మరి మిరు వెళ్ళలేదేం"
ఈ వూళ్ళో సినిమాచూడటం నాకిష్టం లేదు,"
ఇంక అడగబుద్ధి పుట్టలేదు. నేనూ అతనిపక్కనే నిలబడ్డాను. మూడుబస్సులు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాయి. శ్రీనివాసరావుఉద్రేకంగా అనేశాడు.
"ఈ వూర్లో సగం జీవితం బస్సులకోసం యెదురు  చూడ్డంతోనే గడిచిపోతుంది. ఇక్కడ జనం ఇలా యాంత్రికంగా బ్రతకాలి. నే చెప్పబోయేది ఈవూళ్లో వున్న మధ్యతరగతి జాతిగురించి. గాలీ వెల్తురూలేని చిన్న చిన్న యింటి వాటాల్లో బల్లుల్లా పడివుండాలి నీళ్లు ఉదయంలేవడం స్నానం గట్రా ముగిసినతర్వాత యింత నోట్లో వేసుకుని బస్సుకోసం యెదురుచూచి చివరికి సాధించి యిల్లుచేచరుకోవడం, స్నానం ముంగించి  యింత యెంగిలిపడి నిద్రకోసం యాతనను భవించడమూను. మళ్ళా తెల్లవారడం, మళ్ళీ  బస్సులూ, ప్రయాణాలు. ఇదంతా  'జీవించడం' కోసం పొట్టపోషించుకోవడంకోసం కళా గిళా వల్లకాడూ అంటూ  అందమైన -జీవితాన్ని ఆశించాలంటే చేతిలో అంతో యింతో ఉండాలి. నాకు విసుగుపుడుతోంది మాస్టారు! నిజం"
నిజమేనేమొ. నేనింత నిశితంగా ఆలోచించలేదుమరి. మావూరు వదిలొచ్చాననే దిగులు ఒక్కటే మొదట్లో ఉండేది. ఇప్పడదీ దూరం అవుతోంది. అందుచేతనే పాత శ్రీనివాసరావు నాకు ఇవాళ కొత్తగా కనిపించాడు.
వర్షం బాగా తగ్గిపోడం చేతనూ, శ్రీనివాసరావు బలవంతం చేతనూ నడక ప్రారంభించాను. దార్లో  శ్రనివాసరావు బలవంతంచేత నడక ప్రారంభించాను. దార్లో శ్రీనివాసరావు గుండెల్లో దాగినకథ కదిలింది.
బి. ఏ. పాసయిన శ్రీనివాసరావు ఏడాదిపాటు గోళ్ళు గిల్లుకోడం, వాళ్ళ మేనమామకి బాధకగిలింది. ఉత్తరంరాసి శ్రీనివాసరావు ని హైద్రాబాద్ తెచ్చుకున్నాడు.  ఆయన పనిచేస్తున్న (ఎంతో కాలంగా) ప్రైవేటుకంపెనీలో   ఉద్యోగం  వేయించాడు.   ఆ కంపెనీ మంచి స్థితిలో ఉన్నది. జీతం పెద్దదే కాకుండా ఏడాదికి రెండు బోనసులట.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS