అభిలాష
-----: యండమూరి వీరేంద్రనాథ్
తెల్లవారు ఝామున నాలుగు గంటలైంది
మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుని వున్నాడు చీరంజీవి. రాత్రినుంచీ ఏడవటంవల్ల కంటిపక్క నీటి చారలు కట్టినయ్. రాత్రంతా నిద్రపోలేదు _ కొంచెంసేపు ఏడ్చాడు. తరువాత అది వెక్కిళ్ళలోకి దిగింది. తరువాత అదీ ఆగిపోయింది.
ఆ కుర్రాడి నాలుగడుగుల దూరంలో అతడి బాబాయ్ కూర్చుని వున్నాడు.అతడి మోహం అంతా రక్తం తోడేసినట్టూ తెల్లగా పాలిపోయివుంది. అతడి నేకారైనా పరీక్షగా చూస్తే ఆ వణికే పెదవులూ, చేతివేళ్ళూచూసి, అతడేక్షణమైనా నేలకూలి పోతాడని తప్పనిసరిగా భావిస్తారు. అంత చలిలోకూడా వళ్ళంతా చెమట పట్టింది.
"ఇంకా ఎంతసేపయింది బాబాయ్ "అడిగేడు..
"...... గంట" వణుకుతూన్నకంఠంతో అతడున్నాడు.
* * * *
విశాలమైనా జైలు ఆవరణంలో చీకటి చాపలా పరుచుకుని వుండి. జేగురురంగు గోడలు పల్చటి వెన్నెల్లో మరింత వేళ వేళ బావుతున్నాయ్.
వరసుగా వున్న సేల్స్ లో ఖైదీలు నిద్రపోతున్నారు.
పొడవాటి వరండాలో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుస్తున్నారు. దూరంనుంచి పడుతున్న లైటు కాంతిలోవారి నీడలు పొడుగ్గా పాముల్లా కదుల్తున్నాయి. ఇద్దరూ ఒకసేల్ దగ్గర అగేరు. తాళం తీస్తున్న చప్పుడికి లోపలి ఖైదీ తలెత్తి చూసేడు. కిర్రుమంటూ తెరుచుకున్న తలుపు చప్పుడు తప్పంతా నిశ్శబ్దం.
పొట్టిగా వున్న వ్యక్తి ఖైదీకి కొత్త యూనిఫాం యిచ్చాడు. ఉరికిముందు కొత్త బట్టలు ఇవ్వటం ఆచారం.
జైలు రూల్స్ ప్రకారం ఖైదీకి అతడి మరణం గురించి ఇరవై నాలుగు గంటలు ముందుగా తెలియబరుస్తారు. అతడు ముందు నిశ్శబ్దంగా రోదించాడు. కానీ సమయం గడిచి, ఉరి దగ్గరి పడుతున్న కొద్దీ అదో రకమైన వేదాంత భావం అలవడింది. కొంతమంది ఏడుస్తారు. కొంతమంది గింజుకుంటారు. కొంతమంది హిస్తీరిక్ గా మారతారు. కాని చాలా మంది. నిర్లిప్తంగా దాన్ని ఆహ్వానిస్తారు. ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటలలోమతనం అని తెలియగానే చాలమంది జీవచ్చవాలవుతారు.
ఖైదీకిమరణ సమయం తెలియబర్చడానికి ఒకరోజు ముందు, అంటే మొత్తంమీద రెండురోజులముందు, అతడి బంధువులకి ఆ విషయం తెలియబరుస్తారు. బంధువుల్నిఆవిషయం ఖైదీకి చెప్పవద్దని అంటారు. గానీ, అదెలాగైనా వారి ప్రవర్తనబట్టి తెలిసిపోతుంది. ఖైధీకి.
మరణశిక్ష ధ్రువీకరింపబడిన ఖైదీల్నిసాధ్యమయినంతవరకూఒంటరి గానే వుంచుతారు. పిచ్చి ఆవేశంలో తోటి ఖైదీల మీద దౌర్జన్యం చేయకుండా... అలాగే మిగాతాఖైడీలు నిద్రలో వున్నప్పుడే, సూర్యోదయానికిముందే 'ఉరి' తీయబడుతుంది. నిశ్శబ్దంగా తమలోంచి ఒక ఖైదీ మాయమైన సంగతి మరుసటిరోజు ఖైదీలు గుర్తిస్తారు.
అంతకుముందురాత్రి డాక్టర్ వచ్చి అతన్ని పరీక్షచేశాడు. అతడు అనారోగ్యంగా లేడని ధ్రువీకరించాడు. అలా ధ్రువీకరిస్తేనే ఉరి అమలు జరుగుతుంది. ఆరోగ్యం సరిలేని ఖైదీని ఉరివేయరు.
ఖైదీ కొత్త బట్టలు కట్టుకున్న తరువాత అతడి చేతులు వెనక్కి కట్టబడ్డాయి.
ఇద్దరూ బయటికి వచ్చారు. ఖైయిదీ వెనుతిరిగి, ఆఖరిసారి తన గదిని చూసుకున్నాడు. గుమ్మం దగ్గర నిలబడిన సెంట్రీని కళ్ళతోనే పలకరించి, ".... వెళ్ళొస్తాను " అన్నట్టు చూసేడు. సెంట్రీ కళ్ళు తిప్పుకున్నాడు. అతడు చాలా కుర్రవాడు. మరణాల్ని చూడలేదు_ ఇంకా.
వారందరూ వరండాలో నడుస్తూంటే జైల్లో గంట కొట్టింది..... నలుగున్నార అయినట్టూ.....
మచ్చల్నీ, మిగతా గుర్తుల్నీ పరీక్షించి అతడే ఉరితీయబడాల్సిన వ్యక్తిగా ధ్రువీకరించి వ్రాసుకున్నాడు.
ఆ తరువాత వారెంటు చదవబడింది.
"నీ భార్యని హత్యచేశావన్న కారణంగా నిన్ను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ననుసరించి ఉరి తీస్తున్నారు.
అతడు మౌనంగా తనపై మోపబడిన అభియోగాన్ని విన్నాడు.
ఖైదీ కాళ్ళు దగ్గరికి చేర్చబడ్డాయి. తెల్లటి తాడుతో వాటిని దగ్గరగా బంధించారు.
బంధించేముందు "నీ ఆఖరి కోర్కె ఏదయినా వుందా?" అని అడిగేరు.
ఆ రోజు నిద్రలేచిన దగ్గర్నుంచీ __ మొట్ట మొదటిసారిగా అతడు నవ్వేడు, "...ఏదైనా తీరుస్తారా? .... ఏదైనా?" అన్నాడు.
నిజమే చాలామందికి ఆ అపోహా వుంటుంది, జైలు అధికారులు ఏ ఆఖరి కోర్కెనైనా తీరుస్తారని. అది తప్పు మాన్యూల్ ప్రకారం ఏ ఆకహరి కోరికా తీర్చఖ్కర్లేదు..... చావారిసారిగా ఎవర్నయినా బంధువుల్ని చూడాల్నుంటేతప్ప. అదైనా ముందుగా తెలియబరిస్తేనే. ఈ విషయంలో ప్రచారంలోవున్న కథలన్నీ చౌకబారు కథకులు ప్రచారం చేసినవి. ఖైదీ 'విల్లు, వ్రాయాలన్నా, వ్రాసిన విల్లు మార్చుకోవలాన్నా ఆఖరి కోర్కెగా దాన్ని తీర్చుకోవచ్చు.
"చెప్పేరేం? అదైనా తీరుస్తారా?"
"తీర్చగలిగేది __ చిన్న దేదైనా "
అతడు తిరిగి నవ్వేడు "నా కోర్కె మీ రెవరూ తీర్చలేరు. దేవుడే తీర్చాలి."
"ఏమిటా కోర్కె."
"చనిపోయే ఆఖరి క్షణం ప్రార్ధిస్తాను, విందురుగాని,"
అందరూ ఒకరి మోహాలు ఒకరు చూసుకొన్నారు. తరువాత అతడి మోహం మీదుగా డాక్టరూ,మరో ఇద్దరూ సాక్షులూ రెడీగా వున్నారు.
