Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    " కారులో ఎక్కండి ప్లీజ్"

     కారు ఓ అందమైన భవనం ముందు ఆగింది.

      సుమిత్ర అతన్ని చెయ్యిపట్టుకుని మెల్లగా లోపలికి నడిపించింది.

     అసలే షాక్  తగిలిన సుబ్బారావుకి సుమిత్ర సన్నిహిత రూపమూ, స్రర్శా మరో షాక్ లా తగిలాయి.ఇది నిజమా! లేకపోతే తను చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళగా;  తనకి  సుమిత్ర అంటే యిష్టమని దతెలిసిన ఊర్వసో, తిలోత్తమో కామరూపులు కాబట్టి సుమిత్ర రూపంతో వచ్చారా?

     ఆయొడిన్ చురుక్కుమనేటప్పటికి అతనికి తెలివి వచ్చింది. కళ్ళు తెరచి కలయచూశాడు. సుమిత్ర, సుమిత్ర తల్లీ తండ్రీ, గుమాస్తాలూ, నౌకర్లూ వగైరా వగైరాలు.

      " ఎలా వుంది మీకు" అంది సుమిత్ర.

     జుట్టునీ వొంటినీ అంటుకున్న దుమ్ము దులిపేసుకొన్నాడు గబగబా సుబ్బారావు.సిగ్గుపడిపోయాడు సుబ్బారావు. తనేదో తప్పుచేసినట్టు    " క్షమించండి" అన్నాడు సుబ్బారావు.

    " ఏం పని చేస్తూన్నావబ్బాయీ" అన్నాడు దశలక్షాధికారీ. మిల్ ఓనరూ అయిన తండ్రి.

    "ఫలానా స్కూల్లో టీచరునుండి"

    "బాగుంది నాయనా , ఏ క్లాస్  హోల్డు చేస్తున్నావు."

      "ఫస్టుఫారం."

     సుమిత్ర జాలిగా చూసింది.  " నాన్నా వీరికి తీరుబడి వుంటే మన గోపీకి ట్యూషన్చ్ చెపుతారేమో" అంది.

     వాళ్ళిస్తామన్న జీతానికి,వాళ్ళు రమ్మన్న  టైమ్స్ కి, వాళ్ళవాళ్ల టెరమ్సు కి అన్నింటికీ వొప్పేసుకున్నాడు సుబ్బారావు సుమిత్రకేసి చూస్తూ.ఒక్క గంతులో అతనికి ఆకాశం అంత ఎత్తు ఎగిరినట్టయింది.

     ఒక్క అంగలో వీధిలోకి వచ్చి, అక్కడున్న కారుకి కృకజ్ఞతతో మనస్సులోనే నమస్కరించి  ఒక్కడూ ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు.

     జీవితంలో ఒక అందమైన అమ్మాయినీ, ఆమె లక్షల్నీ ఒకేసారి పొందకలిగే అదృష్టం తాను కలిగివున్నాడా? ఇటువంటి దైవ నిర్ణయం ఏదో  లేకపోతే తాను సుమిత్ర కారువల్లనే ఎందుకు దెబ్బతినాలి? ఓహో దేవుడెంత మంచివాడు. ఎంతదూరం ఆలోచిస్తాడు పాపం? బల్లమీద ఆద్దంలోని తన మూడూ  బై అయిదవ వంతు ప్రతిబింబం  అవును అంది. ఆ ప్రతిబింబాన్ని తానెప్పుడో నమ్మాడు. ఆ  నమ్మకం వృధాపోదు.

     " సుమిత్ర! చూడడంలో మాట్లాడడంలో ఒక ఆర్ద్ర్రభావం  లేదా? ఆమె హృదయం ధ్వనించలేదా?" అని  అడిగింది ఆ ప్రతిబింబం.

    తర్వాత రోజున ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాడు. సుబ్బారావు. అతనికున్న బట్టలలో మంచివీ అందమైనవీ వేసుకుని. సుమిత్ర నవ్వుతూ ఎదురువచ్చింది.

      "నమస్కారం . నయంగా ఉందా మేష్టారూ" అంది.

     "నయమేలెండి.అంత పెద్ద దెబ్బలేంకాదుగా" అన్నాడు తలవంచుకుని సుబ్బారావు.

      "మొదట ఎంతో భయపడిపోయాను ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని.థాంక్ గాడ్ , ఏదో సవ్యంగా తేలిపోయింది."

    "కారు ;పక్కనుంచి డాష్ యిచ్చింది.అదీకాక కారు  అంత వేగంగా రావడం లేదులెండి."

    " పోనీలెండి- గాలిపాట" సిగ్గుపడ్డాడు సుబ్బారావు.

     "ఎప్పుడో  మీ పాట వినాలి వస్తానండీ మనస్తే" అంటూ హేండ్ బాగ్ వూపుకుంటూ  వయ్యారంగా నడిచి  వెళ్ళిపోయింది సుమిత్ర.

     ఆమె మాట్లాడుతూన్నంత సేపు సరీగ్గా తల ఎత్తలేని తన లజ్ఞా. స్వభావానికి చాలా చిరాకుపడిపోయాడు సుబ్బారావు. కాని ఆమె ఎంత సరదాగా  హాయిగా మాట్లాడింది. రోజూ ఇలాగే తనతో మాట్టాడితే బావుండును.

     "లెక్కలు చెప్తారా మేష్టారూ?" అని గోపీ అనేటంతవరకూ అతను అన్యమనస్కుడయే ఉన్నాడు.  " లాభము-శాతము" అన్న గణితబోధినిలోని అధ్యాయాన్ని చూసి యీ మనస్థితిలో ఆ పాఠం చెప్పడంకన్న రసాభాసము వేరే ఉందదనుకున్నాడు.   

    ట్యూషన్ ప్రారంభించి ఒకవారం రోజులయింది.

     ఈ వారం  రోజూలూ సుమిత్ర రూపం కాని, వాక్కుకాని,అడుగు సవ్వడికాని కనపడలేదు, వినపడలేదు సుబ్బారావుకి.

     నిరాశ మెల్ల మెల్లగా నల్ల్లనల్లగా ఆవరిస్తోంది సుబ్బారావుని. నీరసం వస్తోంది.

    అతని మీద  అతనికి విశ్వాసం సన్నగిల్లి వేసవికాలపు ఏటిపాయలాగ భయపడి సిగ్గుపడి ఏడుపులాంటి  యిసుక నేలమీద యింకిపోతోంది.

     అద్దంలో అతని 3/5 ప్రతిబింబం  హెచ్చరించడం మానివేసింది.

    ఇటువంటి    విపత్ సమయంలో -ట్యూషన్ చెప్పి వీధిగేటు దాకా అడుగులు  వేసిన సుబ్బారావుని-
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.