Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    'అనవసరమనే నేను చెబుతున్నాను. నేను చెప్పిన ప్రాణ గండం మీకు పోలీసుల ద్వారానే రానున్నది."
    నమ్మలేనట్లు మురళి చూస్తుండగా జ్యోతిష్కుడు మళ్ళీ అన్నాడు - "సుధాకరరావు , రామాయమ్మ , పట్టాభిరామయ్య గార్లకు మీరు పురిగోల్పిన కారణంగా, మీ కోరిక పై, డబ్బాశతో నేను హత్య చేశాను, హత్య లేలా జరిగినది నేను వివారించగలను జ్యోతిష్కుడిని కదా మరి -- నేను స్వయంగా నేరాన్నాంగీకరిస్తే పోలీసులు తప్పక నమ్ముతారు. ఎందుకంటె ఈ నాలుగు హత్యల వల్ల నా కేమీ ప్రయోజనం లేదు. అన్నింటివల్లా మీరు పూర్తీ ప్రయోజనం పొందారు. నాలుగు హత్యలు ఒకదాని తర్వాత ఒకటిగా జరిగి ఒకే మనిషికి లాభించడం కాకతాళీయంగా జరిగిందంటే ఎవరు నమ్మగలరు?" జ్యోతిష్కుడు ఆగి ప్రశ్నార్ధకంగా మురళి వంక చూశాడు.
    మురళికి ముచ్చెమటలు పోశాయి. ఇటువంటి ప్రమాదాన్ని తనూహించలేదు. జ్యోతిష్కుడు తన్ను హంతకుడిగా నిరూపించే పధకంలో ఉన్నట్లు అతనికి చూచాయాగా కూడా తోచలేదు. మీదుమిక్కిలి తనే జ్యోతిష్కుడిని బెదిరించవచ్చు ననుకున్నాడు. జ్యోతిష్కుడు హంతకుడని తనకు తెలుసు. కానీ కధ అడ్డం తిరిగింది.
    "మీరెవరో నాకు తెలియదు. ధన లాభం కోపం నిండు ప్రాణాలు తీసే దుర్మార్ఘుడిని కాదు నేను. నాకు ధన లాభాన్నిశించి మీరు మీకు సంబంధం లేని వారిని హత్యలు చేశావు. అందువల్లనే మీకేం ప్రయోజానాం లేదంటున్నారు. అటువంటప్పుడు ఇదంతా ఎందుకు చేశారు? నావల్ల మీకు జరగవలసిన కార్యమేమిటి?" అన్నాడు. మురళి దీనంగా,
    "నేను మీ చెల్లెల్ని ప్రేమించాను. ఆమెను నాకిచ్చి పెళ్ళి చేయండి."
    "నేనూనా చెల్లెలు అత్యంత సామాన్యులం. ఆస్తి కోసం హంతకుణ్ణి కాలేను నేను. ఒక హంతకుడితో నూరేళ్ళ కాపురం నా చెల్లెలి వల్ల కాదు. కాబట్టి దయుంచి ఈ విషయంలో మిమ్మల్ని క్షమించి వదిలి పెట్టేయండి" అన్నాడు మురళి.
    జ్యోతిష్కుడి ముఖం గంభీరంగా అయిపొయింది "-- "మిస్టర్ మురళీ! మీరు సామాన్యులు కావచ్చు కానీ అమాయకులు కారు. చిన్న సంఘటన చెబుతాను. నాకు తెలిసిన ఒక ధనికుడు ఒక గొర్రెను కొన్నాడు. దాన్ని రోజూ బాగా మేపుతూ వచ్చాడు. అది తెగ బలిసింది. ఒక రోజు ధనికుడు ఇంట్లో పార్టీ వచ్చింది. గొర్రెను సిద్దం చేశారు. వంటవాడు కత్తి నెత్తిన సమయానికి గొర్రె కట్లు తెంచుకుని పారిపోయింది. ధనికుడు దానికి పెట్టిన తిండి ప్రసాదించిన బలంతోనే అది అంత బలాన్ని సంపాదించగలిగింది. అప్పుడా ధనికుడెం చేస్తాడో చెప్పండి?" అన్నాడు.
    జవాబు మురళికి తెలుసును. దాంతో పాటు జ్యోతిష్కుడి ఉద్దేశ్యమూ అర్ధమయింది. మళ్ళీ జ్యోతిష్కుడే ప్రారంభించాడు. "నేను గొర్రె నించి మంసాన్నాశించలేదు. పాలు గోరుతున్నాను. న్యాయం కాదంటారా?"
    మురళి ఆలోచనలో పడ్డాడు. ఏ పరిస్థితుల్లోనూ అమ్మల్నీ దుర్మార్గుడికిచ్చి పెళ్ళి చేయరాదు. ఇతడి వద్ద అమ్మలెంతో కాలం జీవించదు.
    "మిస్టర్ మురళీ! నాలో అపారమైన తెలివితేటలూన్నాయి. వాటిని ఇస్నురేన్స్ ఏజెంటుగా ఉపయోగిద్దామనుకున్నాను. మా నాన్నగారి ద్వారా నాకు రామాయమ్మ గారు రాసిన వీలునామా వివరాలు తెలిసిన మీదట మీ గురించి వాకబు చేశాను. సుధాకరరావు వల్ల నాకట్టే ప్రయోజనం కనపడలేదు. అప్పుడు నేను మిమ్మల్నేన్నుకున్నాను. అప్పట్నించి నా కార్యక్రమాలను క్రమంగా అమలులోకి తీసుకువచ్చాను. ప్రతి చావూ మీకు లాభించేదే. అందుకు కారణభూతుడిని నేనన్న విషయం మీరు గ్రహించడం కోసమే ముందుగా ఆ విషయాన్ని చెబుతూ వచ్చాను.
    'ఒక్క సుదర్శనం విషయంలో తప్పితే మిగతా విషయాల్లో నేను పెద్ద రిస్కు తీసుకోలేదు. అన్ని అనుకున్న ప్రకారం అమలు జరుపగలిగాను. మీకు అంతులేని సంపద లభించింది. ఏ విధంగానూ ఎవ్వరూ అనుమానించలేనంత ఎలిబీ మీకుంది. ఏ విధంగానూ కూడా ఎవ్వరూ నన్నునుమానించలేరు. హంతకుడూ నాకూ ఏ విధమైన సంబంధమూ లేదు. ఇంతవరకూ బాగానే ఉంది. మీరు కోరకుండా మీకు సంపదలిచ్చాను నేను. అందులో కొద్దిగా నైనా  ఇచ్చే అభిప్రాయం మీకు లేదు--" జ్యోతిష్కుడు ఆగాడు.
    "నా చెల్లెలితో వివాహం తప్ప మరేదైనా అడగండి" అన్నాడు మురళి ప్రాధేయపూర్వకంగా.
    జ్యోతిష్కుడు కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేదు.
    'అడుగుతున్నాను. అయిదు లక్షలు...." అన్నాడు జ్యోతిష్కుడు.
    "అయిదు లక్షలా....?
    'అవును, ఆశ్చర్యపోకండి. నేను అల్ప సంతోషిని. టెన్ పర్సంట్ అడిగాను. అవసర పడితే మీబోటి గాడు మరొకడికి జోస్యం చెప్పి డబ్బు సంపాదించుకోగలను" అన్నాడు జ్యోతిష్కుడు.
    "మీరు మళ్ళీ మళ్ళీ నావెంట పడరని గ్యారంటీ ఏమిటి?" అడిగాడు మురళి.
    "నమ్మాలి, నమ్మక తప్పదు. హత్యల గురించి పోలీసులకు చెప్పడం నాకూ సరదా కాదు. అందువల్ల నాకూ శిక్ష పడుతుంది కదా! నా కష్టానికి కొంత ప్రతిఫలం మీ దగ్గర్నుంచీ తీసుకుంటున్నాను. దీని తరువాత మనమింక ఒక్కళ్ళకొకళ్ళు చూసుకోము, నేను మరోలా కొత్త క్లయింట్ ని వెతుక్కుంటుంది" అన్నాడు జ్యోతిష్కుడు.
    "రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మీకు అయిదు లక్షలు క్యాష్ రూపంలో అందజేస్తాను" అన్నాడు మురళి.
    జ్యోతిష్కుడు తమాషాగా నవ్వాడు. "చూశారా -- మీరెంత పెద్దవారై పోయారో! అయిదు లక్షల రూపాయలి క్యాషివ్వడానికి ఒక్కరోజు గడువు చాలు" ఒక్క క్షణం ఆగి "ఈ పద్దతి బాగుంది కదండీ! మీమీద కేవిధమైన అనుమానమూ రాని పరిష్టితుల్లో మీ బంధువులు మరణించారు. అటు మరణానికి కారకుడికీ, ఇటు మీకూ కూడా లాభం చేకూరుస్తున్నారు. ఇది కేవలం నా స్వంత గ్రేట్ ఐడియా" అన్నాడు గర్వంగా.
    మురళి సాలోచనగా తల పంకించి, "ఒక చిన్న మనవి, అయిదు లక్షల రూపాయలూ మికిస్తాను. కాని, అవి పోయినట్లు పోలీసు రిపోర్టిస్తాను, ఒకరోజు ఆగి, నోట్ల నంబర్లు మాత్రం పోలీసులకు తెలియకేయను. నా కాబోయే అర్ధాంగి దృష్టిలో నేరస్థుడిగా నిలబడకుండా వుండేందుకు నాకు తోనే ఉపాయా మీదే" అన్నాడు.
    జ్యోతిష్కుడు క్షణమాత్రం అలోచించి, "మిమ్మల్ని నేను నమ్ముతున్నాను" అన్నాడు.

                                      16
    "నేను నమ్మలేను" అన్నాడు మురళి.
    "నిజం , కావాలంటే నువ్వే అడుగు" అంది లలిత.
    "అవసరం లేదులే, ఫోన్ పెట్టేసేయ్, మనం వెళ్ళి చూద్దాం" అన్నాడు మురళి.
    నమ్మడం నిజంగానే కష్టంగా వుంది మురళికి. జ్యోతిష్కుడి శక్తి సామర్ధ్యాల మీద అంతులేని నమ్మకముందతనికి. అటువంటిది తన డబ్బు దొరికిందని పోలీస్టేషన్ నించి ఫోన్ వస్తే నమ్మడం చాలా కష్టంగదా. అతనికి కాస్త భయంగా వుంది కూడా. తను కావాలనే ఇలా చేయించాడని అతడనుమానిస్తే ....
    మురళి, లలిత పోలీస్ స్టేషను కు వెళ్ళారు. అక్కడ కనపడ్డ దొంగను చూసి మురళి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ దొంగ జ్యోతిష్కుడు కాడు, "ఇతనా దొంగ?" అన్నాడు మురళి.
    "దొంగ కాదు, హంతకుడు!" అన్నాడు పోలీసినస్పెక్టర్.
    ఆశ్చర్యపడ్డాడు మురళి.
    కధంతా పూర్తిగా విన్నాక అతనికి జరిగింది తెలిసింది. జ్యోతిష్కుడి దగ్గర డబ్బందని కనిపెట్టిన ఈ దొంగ, అతన్ని హత్య చేసి డబ్బుతో పారిపోతూ పోలీసులకు దొరికిపోయాడు. మురళి పోయిందని రిపోర్టిచ్చిన మొత్తమూ, ఈ మొత్తమూ సరిపోయిన కారణంగా డబ్బు మురళిదే అయుండాలని పోలీసులు నిర్ణయించారు. కానీ, ఇప్పుడతనా విషయన్నింకాస్త దృడంగా ఋజువు చేసుకోవాల్సుంది.
    "ఒకే ఒక్క సాక్ష్యముంది" అన్నాడు మురళి.
    "ఏమిటది?" అడిగాడు ఇనస్పెక్టర్.
    "నేనెప్పుడైనా నోట్ల కట్టలు రిసీవ్ చేసుకున్నప్పుడు, ప్రతి కట్ట పదమూడో నోటు మీద నా సంతకం పెడతాను. అది నా లక్కీ నెంబరు. ఆ విషయం రిపోర్టిచ్చినపుడు నాకు గుర్తులేదు. ఇప్పుడే గుర్తుకొచ్చింది" అన్నాడు మురళి.
    పరీక్షించగా మురళి చెప్పినమాట నిజమేనని తేలింది" పోలీసుల స్వాధీనంలో వున్న వందరోపాయల నోట్ల కట్ట అన్నింట్లోనూ పదమూడో నంబరు నోటు మీద మురళి సంతకముంది.
    లలితతో కలిసి తిరిగి ఇంటికి వెడుతున్నప్పుడు మురళి గుండె బరువెక్కింది. పొలిసు స్టేషన్లో చూసిన గుండెల్లో కత్తి దిగబడి వున్న జ్యోతిష్కుడి ఫోటో అతని గుండెలు పిండుతోంది.
    జ్యోతిష్కుడు తన అదృష్టం కోసం హత్యలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు -- నాలుగు హత్యలు చేశాడు. ఫలితంగా అయిదు లక్షలు తననుంచి ఆశించాడు.
    కానీ, విధి మరోలా తలచింది. అతను తన నుంచి ఆ అయిదు లక్షలను కూడా విడదీయలేకపోయాడు. ఇప్పుడతను ఏ ప్రతిఫలమూ లేకుండా తన గురించి పాటుబడినట్లయింది.
    ఎంతమంది చావుల గురించో ముందుగా జోస్యం చెప్పగలిగిన జ్యోతిష్కుడు, పాపం -- తన చావు గురించి మాత్రం ముందుగా జోస్యం చెప్పుకోలేక పోయాడు.

                         ---:అయిపొయింది :------
    




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.