Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
"ఎటాండి మీరు మీ బంధువుల గురించి తెలియకుండా వున్నారు" అంటూ అతను ఆవిడ ఊరు పేరు చెప్పాడు.
చటుక్కున గుర్తొచ్చింది మురళికి. అప్పుడప్పుడు అతను, తల్లీ , చెల్లెలూ వాళ్ళ ఊరెళ్ళి వస్తుందేవాళ్ళం. ఆవిడది చిన్న పల్లెటూరు , పాపం ఆవిడకి ఎవ్వరూ లేరు.
మురళి నాన్నగారంటే చాలా అభిమానంగా వుండేది" చాలా ముసలావిడ. తొంబై ఏళ్ళు ఉండవచ్చునెమో.
'ఆవిడ ఇంకా సరిగ్గా , రెండే రెండు రోజులూ బ్రతుకుతుంది, ఈవేళ కాక" అన్నాడతను.
తీవ్రంగా అతని కళ్ళలోకి చూసి, "హత్య చేస్తారా?" అనడిగాడు మురళి.
అతను నవ్వి - "మీరలా అడగడం శాస్త్రానికే అవమానం. జరగబోయేది చెప్పగలను నేను. జరుగబోయేది తెలుసుకోగల అద్భుత జ్యోతిష్కుడుగా మీరు నన్ను గుర్తించుకుంటే చాలు---" అన్నాడు.
'అందువల్ల ఏమిటి మీకు ప్రయోజనం ."
"మహాత్ములు ఏపనినీ ప్రయోజనాన్నాశించి చేయరు. పరోపకారార్ధమే వారు జీవిస్తారు."
"రామాయమ్మ గారిని చావనివ్వను నేను, ఈ హత్యను ఆపుతాను నేను.' అన్నాడు మురళి ఆవేశంగా.
"విధి నిర్ణయానికి కట్టుబడి ఉండడం మనిషి కర్తవ్యం. ఎదిరించడానికి ప్రయత్నించిన వారందరూ నాశనమై పోతున్నారని చరిత్ర చెబుతోంది ." అన్నడతను. అతని చూపుల్లోని ఏదో శక్తి మురళిని భయం కలిగించింది.
'అంటే మీ ఉద్దేశ్యం?" అన్నాడు మురళి.
"కంగారు పడకండి ఓ వారం రోజుల్లో మీరు రామాయమ్మగారు పోయినట్లుత్తరం వస్తే -- ఆ విషయం ఒక జ్యోతిష్కుడు మీకు ముందుగానే చెప్పాడని గుర్తుంచుకోండి -- అంతే!"
8
హరికధ ఆ రోజుతో ఆఖరు. ఆరోజున రావణ వధ దాసు గారు రమ్యంగా యుద్ధ ఘట్టాన్ని వర్ణించి చెబుతుంటే పరవశంగా వింటున్నారు రామాయంమగారు.
రామాయమ్మగారికి ఆ ఉళ్ళో మంచి పేరుంది. ఆవిడకు పదెకరాల మాగాణి ఉంది. రెండు స్వంతిళ్ళున్నాయి. బ్యాంకులో కూడా డబ్బుంది. ఇంట్లో బంగార ముంది. అన్నిటికీ మించి బుర్రలో తెలివుంది. పదిమందికి సహాయపడే మంచిమనసుంది. తొంబై ఏళ్ళు ఉండినా చెడని శరీరారోగ్యం ముంది.
ఈ హరికధ ఆవిడ ఏర్పాటు చేసిందే, ఊరు ఊరంతా వచ్చి వింటున్నారు. దాసుగారు కూడా మంచి ప్రావీణ్యం కల వాడిలా ఉన్నాడు. శ్రావ్యంగా గానం చేస్తూ గత రెండు వారాలుగా ఉళ్ళో వారి నాయన అలరిస్తూనే ఉన్నాడు.
ఆరోజు హరికధ ముగిస్తుంది. రావణుడు మరణిస్తాడు. ఆ సందర్భంలో దాసుగారికి దండిగా కట్నాలు ముడుతున్నాయి. ఒక్కొక్కరే అయిదులు, పదులు, పాతికలు అర్ధ నూట పదహార్లు చదివిస్తున్నారు. రామాయమ్మగారు నూట పదహార్లు చదివించింది.
చదింపులయ్యాక శ్రీరాముడు రావణాసురుడి బొడ్లో బాణం కొట్టాడు, రావణాసురుడి కధ ముగిసింది.
హరిదాసు గారు తన మాటలు కొన్ని చెప్పాడు. 'అయ్యా -- అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రావణాసురుడు లుంటూనే ఉంటారు. శ్రీరామచంద్రులూ ఉంటారు. వీరిమధ్య నిరంతర పోరాటం కొనసాగుతూనే వుంటుంది. కానీ అప్పుడప్పుడు రావణాసురుడికీ విజయం లభించవచ్చు. కానీ ఆవిజయం తాత్కాలికమే కావడానికి ప్రజలు సహకారించాలి. న్యాయబలం , ప్రజాబలం , అందువల్లనే చిట్టచివరకు ఆ బలం నెగ్గగలిగింది.
మీ గ్రామంలో ఉన్న రామాయమ్మగారి వంటి వ్యక్తీ ఇంతవరకు నాకెక్కడా తటస్థపడలేదు. జీవితమే ఒక సమారమనుకుంటే ఆ సమరంలో ఇంతవరకూ రామాయమ్మగారు సాధించిన విజయం వెనుక ఆవిడ నడుస్తున్న ధర్మన్యాయ మార్గాలున్నాయి. అందువల్లనే ఈ వయసులో కూడా ఆవిడ ఆరోగ్యంగా ఉండగలిగారు. పూర్వనీయులగు రామాయమ్మగారు తమ ధర్మ న్యాయ మార్గాల ద్వారా మరిన్ని వర్షాలు జీవించాలని కోరుకుంటున్నాను. శ్రీరామచంద్రుడి రాజ్యంలో ప్రజలకు ఏలోటు లేదు, ఏ ఈతి బాధలూ లేవు. అందుకే శ్రీరామ రక్ష అన్నపదం వాడుకలోకి వచ్చింది. రామయమ్మగారి ఉనికి ఈ గ్రామానికి శ్రీరామరక్ష అని నా అభిప్రాయం --" అన్నాడు.
అక్కడున్నా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ గ్రామంలో ఆవిడ కోక విశిష్టస్థానముంది. ఆవిడంటే అందరికీ అభిమానం.
జనంలోంచి ఒక వ్యక్తీ తోసుకుంటూ ముందుకు వచ్చాడు. అతనికి సుమారు పాతికేళ్ళు పైనే ఉండవచ్చు. ధోతీ, లాల్చీ లలో నిండుగా కనిపిస్తున్నాడతను.
"కారణం గారబ్బాయి" అనుకున్నారు చాలా మంది గుసగుసగా. పల్లెలూళ్ళలో కుర్రాళ్ళని పెద్ద వాళ్ళ తండ్రి పేరుతొ గుర్తుంచుకోవడం కద్దు. కరణం గారబ్బాయి స్టేజి మీదకు వచ్చి హరిదాసు గారికి ప్రణామం చేసి తర్వాత ఊరందరికీ నమస్కరించాడు.
'శ్రీదాసు గారు రామాయణాన్ని మహాద్భుతంగా గానం చేశారు. ఈ రోజుల్లో మావంటి కుర్రవాళ్ళ క్కూడా అత్యంతాశక్తికరంగా ఉండే విధంగా అయన కధ చెప్పారు. కధ చెప్పిన ఆయనకూ, అది ఏర్పాటు చేసిన రామాయమ్మగారికీ ఊరి తరపున నా అభినందనలు . ఈ శుభసమయంలో నేను పంచి పెట్టె ఈస్వీట్స్ శ్రీరామ ప్రసాదం కావాలని కోరుకుంటున్నాను. ఒక పర్యాయం దాసు గారిని నావద్ద నున్న ఈ స్వీట్లను తాకి పవిత్రత నాపాదించవలసిందిగా కోరుతున్నాను" అన్నాడతను.
అతని భుజానికి తగిలించి ఉన్న సంచీని ఒక పర్యాయం దాసు గారికి అందించాడు. అయన దాన్నందుకుని కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి -- "కానివ్వండి బాబు" అన్నాడు.
కరణం గారబ్బాయి ప్రసాదాలు పంచి పెట్టడం ప్రారంభించాడు. ముందుగా అతడు హరిదాసు గారికి సంచీలోని స్వీట్స్ ఇచ్చాడు. తరువాత అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఇవ్వసాగాడు.
అతను రామాయమ్మగారి దగ్గరకు వెళ్ళి స్వీట్స్ అందిస్తూ మీవంటి పుణ్యాత్మురాలికి ఈ లోకంలో కంటే ఆ లోకంలో లభించే సత్కారాలే ఎక్కువ" అంటూ పాదాభివందనం చేశాడు.
ఆవిడ ఆప్యాయంగా అతని తల నిమిరి ప్రసాదం నోట్లో వేసుకుంది.
* * * *
"అచార్లుగారూ ఒక్కసారి మా ఇంటి కోస్తారా?' అన్నాడు రామం.
రామం వారాల మీద చదువుకుంటున్న పిల్లవాడు. అతని మకాం రామాయమ్మ గారింట్లో. వారానికొకసారి ఇంట్లో భోం చెస్తుంటాడు. ఎవరింట్లోనూ వారం దొరకనప్పుడు రామాయమ్మ గారింట్లోనే భోం చెస్తుంటాడు.
"ఏమిటి కధ పొద్దునే ఇలా వచ్చావ్?" అచార్లు గారిడిగేరు.
'అమ్మగారు రాత్రి పడుకున్నారా రోజూ పొద్దు పాడవకుండా లేచేవారింతవరకూ లేవలేదు. వెళ్ళి పలరిస్తుంటే పలకరు. ముందు వంటావిడ చూసింది విషయం. ఒక్కసారి మీరు వచ్చి చూస్తె బాగుంటుంది. మాకేమితో భయంగా ఉంది."
అచార్లు గారు వెంటనే చొక్కా వేసుకుని మందుల సంచీ తీసుకుని చెప్పులు తొడుక్కుని రామం వెంట బయల్దేరాడు. అయన రామాయమ్మగారిల్లు చేరుకునే సరికి అప్పుడే చుట్టుపక్కల జనం చాలా మంది పోగయ్యారు. అక్కడ చేరిన జనం కబుర్లను బట్టి ఆవిడ పోయుంటుందని అందరూ అనుకుంటున్నట్లు ఆచార్లు గారికి అర్ధమయింది.
అయన రామాయమ్మ గారిని చూస్తూనే ముఖంలో జీవకళ లేదనుకున్నారు. తర్వాత చేయి పట్టుకుని నాడి పరీక్షించి చేయి క్రింద పెట్టేసి తలవంచుకున్నాడు.
"ఏమంటాచార్లుగారు" అన్నారెవరో.
"అనడానికేముంది పెద్దావిడ కధ అయిపొయింది" అన్నడాచార్లు గారు.
హటాత్తుగా ఘోల్లుమని ఏడ్పులు ప్రారంభమయ్యాయి. ఏడ్పుల మధ్య రామాయమ్మ గారి గుణగునాలు ప్రస్తుతి కొనసాగుతోంది.
"నిన్న రాత్రిదాకా చక్కగా ఉంది కదమ్మా రాత్రికి రాత్రి ఏమయిందో ఏమిటో!"
'ఆ తొంబై ఏళ్ళు నిండాక ఏదో ఒక రోజు తప్పదు"
"చాలా పుణ్యాత్మురాలు , తనేర్పాటు చేసిన హరికధ ముగిసేవరకు ఉండి రావణాసురుడి చావు చెవులారా విన్నాకనే మరణించింది."
'ఆ చావు కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. పువ్వులా వెళ్ళిపోయింది. ఓ జబ్బు లేదు ఏం లేదు, భీష్ముడిలా స్వచ్చంద మరణం పొందినట్లుంది."
ఈ కబుర్లు వింటున్న వారిలో కరణం గారబ్బాయి ఉన్నాడు. అందరితో పాటు అతనూ కొన్ని మాటలు అంటున్నాడు.
9
"నాపేరు రమణరావు" అన్నాడు కాఫీ తాగుతూ.
"మీరు మా నాన్నగారి స్నేహితులనుకుంటాను" అన్నాడు మురళి ఆయనెవరో అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ.
"మీకు రామాయమ్మగారు తెలుసుననుకుంటాను నేను వారి లాయర్ని.'





