Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు ఫిలప్ చేశాం."
    "ఎలాంటి కాండిడేట్స్ సెలక్తయ్యారు?"
    "న్యాయానికి పోస్టుకు బీయస్సీ చాలు. కాని ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ పరిస్థితుల వల్ల డాక్టరేట్స్ కూడా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దర్నీ కాక నాలుగేళ్ళ రీసెర్చ్ అనుభవమున్న మరో ఇద్దర్నీ కూడా సెలక్టు చేశాం. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎందుకడుగుతున్నారు?"
    విశ్వనాధం నవ్వి -- "నా గురించి మీకేవిధమైన సమాచారమూ అందలేదా?" అనడిగాడు.
    "నిన్నరాత్రి హైదరాబాద్ నించి ట్రంక్ కాల్ వచ్చింది. మీ పేరు చెప్పి మీరు వస్తే చేయగల సహాయం చేయవలసిందిగా అక్కడి పోలీస్ కమీషనర్ కోరాడు...."
    'అదిసరే -- అందుకే సమాచారం సేకరిస్తున్నాను. నలుగురు అసిస్టెంట్స్ -- ఉద్యోగంలో చేరారా?"
    "నలుగురూ చేరారు. నిన్ననే వాళ్ళు ఏయే సెక్షన్లో పని చేయాలో నిర్ణయించడం కూడా జరిగిపోయింది .... ఇంతకీ...."
    'ఆ నలుగురి గురించీ పూర్తీ సమాచారం కావాలి నాకు" అన్నాడు విశ్వనాధం.
    ముఖర్జీ క్షణం తటపటాయించి వాళ్ళ ఫైల్సు తెప్పించాడు. ఒకతని పేరు నారాయణ పాత్రో. బరంపురం లోనే పుట్టి పెరిగాడు. ఎమ్మెస్సీ ఉత్కళ యూనివర్సీటీలో చదివాడు. ప్రస్తుతం వయస్సు ఇరవై ఆరేళ్ళు. రెండోవాడి పేరు పావనమూర్తి. తెలుగువాడు. డాక్టరేటుతో సహా అంతా ఆంధ్రా యూనివర్సీటీలోనే . అతని వయస్సు కూడా ఇంచుమించు పాత్రో అంతే ఉంటుంది. మూడో అతనికి కూడా పీహెచ్ డి ఉంది. పేరు నిత్యానంద్ బోస్. కలకత్తా యూనివర్సీటీ లో చదివాడు. నాలుగో వాడు రామానందం. తెలుగువాడు. గుంటూర్లో ఎమ్మెస్సీ చదివాడు. నాలుగేళ్ళుగా రీసెర్చి చేస్తున్నాడు. అందరూ ఇంచుమించు సమ వయస్కులే."
    వాళ్ళ వివరాలు జాగ్రత్తగా ఒక కాగితం మీద నోట్ చేసుకున్నాక "చాలా థాంక్స్. రేపు నేను ఈ నలుగురినీ కలుసుకునేందుకు అవకాశం కలిగించండి. అయితే నేను ఫలానా అని తెలియకూడదు. వాళ్ళు పనిచేసే లాబరేటరీలోని సైంటిస్టు కు నన్నప్పగించండి. తర్వాత వ్యవహారం నేను చూసుకుంటాను."]
    ముఖర్జీ కుతూహలంగా అతని వంక చూసి --"ఇందాకటి నుంచి నా ప్రశ్నకు జవాబివ్వకుండా దాటేస్తున్నారు. వీళ్ళతో మీకేం పనో నాకు చెప్పలేదు. అదంత చెప్పకూడని రహస్యమా ?" అన్నాడు.
    "మీ లేబరేటరీ వైద్య వృక్షాల మీద చేయనున్న పరిశోధన అంతర్జాతీయ సంచలనాన్ని సృష్టించిన సంగతి మీకు తెలుసు కదా."
    వేరే చెప్పాలా అన్నట్లు నవ్వాడు ముఖర్జీ.
    'ఆ పరిశోధన తీరునూ, ఫలితాలనూ, ఎప్పటికప్పుడూ తెలుసుకోవడానికి విదేశ గూడచారి సంస్థ ఒకటి పనిచేస్తోంది.'
    "అయితే?"
    "మీ లాబరేటరీలో కొత్తగా చేరిన నలుగురు జూనియర్ సైంటిఫిక్ అసిస్తేంట్లలోనూ ఒకడు విదేశ గూడచారి " అన్నాడు విశ్వనాధం.
    ముఖర్జీ దెబ్బతిన్న ముఖం పెట్టాడు.

                                       4
    "హి యాజ్ డాక్టర్ విశ్వనాధం -- " అంటూ పరిచయం చేశాడు ముఖర్జీ.
    "గ్లాడ్ టూ మీట్యూ" అన్నాడు సైంటిస్టు సాహు"
    "మీ లాబరేటరీలో జరుగుతున్న పరిశోధనల వివరాలు చెప్పండి. మీదగ్గర అయేక తర్వాత లాబరేటరీ కి తీసుకు వెళ్ళండి" అని చెప్పి ముఖర్జీ వెళ్ళిపోయాడు.
    "నేను కాసేపు మీతో డిస్కస్ చేస్తాను" అన్నాడు విశ్వనాధం.
    సాహు అతన్ని అక్కడున్న స్టాఫ్ కు పరిచయం చేశాడు. సాహు కాక మరి నలుగురున్నారక్కడ. వాళ్ళలో పావనమూర్తి కూడా ఉన్నాడు.
    "కొన్ని ఖనిజాలను సల్ప్యూరికాసిడ్ లో శుభ్రపరిచే ప్రయోగాలు చేస్తున్నాం మేము. ఖనిజం సల్ఫ్యూరికాసిడ్ లో కరగదు. కానీ కొన్ని ఇంప్యురిటీస్ యాసిడ్లో కరిగిపోతాయి. ఇందుకు మేము డైల్యూట్ యాసిడ్ వాడతాము. డైల్యూషన్ ఎంతంటే బాగుంటుందో తేల్చడానికి ప్రస్తుతం కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిని డాక్టర్ పావనమూర్తి చేస్తున్నాడు." అన్నాడు సాహు.
    విశ్వనాధం కాసేపు అవీ ఇవీ ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత కుతూహలం కలిగినవాడిలా చటుక్కున లేచి పావనమూర్తి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు పావనమూర్తి డైల్యూట్ సల్ప్యూరిక్ కాసిడ్ తయారుచేస్తున్నారు.
    పావనమూర్తి ఒక కొలజాడీలో వంద మిల్లీ లీటర్లు యాసిడ్ తీసుకుని పక్కనే వున్న లీటరు బీకరులో పోసి గ్లాస్ రాడ్ పెట్టి గబగబా కలిపాడు. యాసిడ్ పోసేసరికి బీకర్లో సగానికి నీళ్ళున్నాయి.
    విశ్వనాధం ఆశ్చర్యంగా -- "డైల్యూట్ సల్ప్యూరికాసిడ్ చేసే పద్దతి అది కాదనుకుంటాను" అన్నాడు.
    సల్ప్యూరికాసిడ్ ను నీళ్ళలో వేస్తె వేడి పుడుతుంది. అందుకని - ఒక కొనికల్ ప్లాస్కు పైభాగాన్ని ఆడకుండా నీళ్ళలో చల్లబరుస్తూ - ఆ కోనికల్ ప్లాస్కు లో వున్న నీళ్ళకు కొద్ది కొద్దిగా యాసిడ్ వేసి గబగబా కదుపుతుండాలి అలా కాకుండా ఒక్కసారి నీళ్ళలో అంత యాసిడూ పోసేస్తే ఒక్కసారిగా పుట్టిన వేడికి బీకరు పగిలిపోయే ప్రమాదముంది. అందుకే విశ్వనాధం అలా అడిగాడు. అందులోనూ పావనమూర్తికి కెమిస్ట్రీ లో పీహెచ్ డి డిగ్రీ కూడా ఉంది.
    పావనమూర్తి నవ్వి - "నాకు తెలుసునండీ. రీసెర్చి లోనూ, ముఖ్యమైనా ప్రయోగాలలోనూ మేమలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటాం. కానీ ఇది సైరేక్సు గ్లాసు బీకరు. చాలా వేడిని తట్టుకోగలదు. అదీగాక ప్రతి అర్ధ గంటకూ సొల్యూషన్ కావాల్సోచ్చినపుడు చాదస్తాన్ని పక్కకు నెట్టి కాస్త రిస్క్ తీసుకుంటుంటాం. ఈ మాత్రం రిస్కు తీసుకోవచ్చునని అనుభవం నాకు చెప్పింది" అన్నాడు.
    విశ్వనాధం మరి కాసేపు అక్కడ గడిపి - తర్వాత లాబరేటరీ లోకి వెళ్ళాడు. అందులో డాక్టర్ నిత్యానంద బోస్ పని చేస్తున్నాడు. ఆ లాబరేటరీ ఇన్ చార్జి డాక్టర్ పాత్రో అతనికి పరిచయం చేశాడు.
    విశ్వనాధం తో మాట్లాడబోయే ముందు అతను బోస్ ని పిలిచి - "రేపు మనం చేయబోయే ఎక్స్ పెరిమెంటు లో మాయిశ్చర్ ఉండకూడదు. ప్రయోగంలో వాడబోయే గాజు సామానంతా పెర్ ఫెక్ట్ డ్రై కండిషన్ లో ఉండాలి"అని చెప్పాడు. బోస్ తలాడించి వెళ్ళిపోయాడు. అతను బీకర్సు వాష్ చేస్తున్నాడు.
    మహాపాత్రో నవ్వుతూ విశ్వనాదానికి చెప్పాడు --"మేమిక్కడి కొన్ని హైప్యూరిటీ కెమికల్సు తయారు చేస్తున్నాము. అందుకే బీకర్సూ అవీ కూడా మేమే స్వయంగా కడుక్కుంటాము. ఇలాంటి విషయాలు అటెండర్స్ కు వదిలిపెడితే కుదరదు గదా. సైంటిఫిక్  క్లీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిష్ వాషింగ్ " అన్నాడు.
    మహాపాత్రో చెప్పే మాటలు వింటూనే విశ్వనాధం ఓ కంట బోస్ ని కనిపెడుతున్నాడు. అతను ఒక్కొక్క బీకర్ నీ, కోనికల్ ప్లాస్క్ నీ ముందు టాప్ వాటర్ తో కడిగి తర్వాత డిస్టిల్డ్ వాటర్ తో తొలిచి -- పక్కనే ఉన్న ఎయిర్ ఓవెన్ లో పెడుతున్నాడు. ఎంతో జాగ్రత్తగా చూస్తె కానీ అతనేం చేస్తున్నాడో కనిపించదు. వర్క్ బెంచీ కాస్త అడ్డుగా ఉంది. అది స్పష్టంగా చూడ్డం కోసమని విశ్వనాధం చటుక్కున లేచి నిలబడి బోస్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే ఎయిర్ ఓవెన్ తలుపులు మూస్తున్నాడు బోస్.
    "టెంపరేచర్ ఎంతుంది?"
    "తొంబై అయిదు డిగ్రీలు" అన్నాడు బోస్.
    'మరి కాస్త ఎక్కువుంచితే - బీకర్లు ఇంకా తొందరగా డ్రై అయిపోతాయి గదా ..." అన్నాడు విశ్వనాధం,
    'అవుననుకోండి. డిసికేటర్లకు వాడే సిలికేజేల్ కూడా ఇందులో డ్రై చేస్తున్నాం. టెంపరేచర్ 120c దాటితే సిలికాజెల్ పాడై పోతుంది. అందుకని సాధారణంగా వంద దాటనివ్వం."
    విశ్వనాధం తన జేవులోని రుమాలు తీసి "ఇందాక దీన్ని తడపవలసి వచ్చింది. ఈ ఓవెన్లో పెడితే అరుతుందంటారా?" అన్నాడు -- అందుకే తనతన్ని ప్రశ్నించినట్లు.
    "బీకర్లో పెట్టి వాచ్ గ్లాసు మూత పెడితే పాడవదు" అన్నాడు బోస్.
    విశ్వనాధం అలాగే చేశాడు. ఆ తర్వాత అతను పక్క లాబొరేటరీ లోకి వెళ్ళాడు. అక్కడి సైంటిస్ట్ గోపాలరావు "టెంపరేచర్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసే పరికరాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీటిల్లో మేము కొత్త ప్రిన్సిపుల్స్ ఉపయోగిస్తున్నాం" అంటుండగా "కనెక్షన్స్ న్నీ పూర్తయ్యాయి సార్ ' అన్నాడు ఒకతను వచ్చి.
    'మీట్ మిస్టర్ నారాయణ పాత్రో. కొత్తగా ఇక్కడ చేరారు" అంటూ ఇద్దరినీ పరస్పరం పరిచయం చేసి "వన్ మినిట్ ప్లీజ్" అంటూ కనెక్షన్స్ చూడ్డానికి వెళ్ళాడు గోపాలరావు.
    అక్కడొక ఫర్నేస్ ఉంది. ఫర్నేస్ నించి ఒక ఇన్ స్ట్రూమెంటుకు తీగలతో కనెక్షన్ ఉంది. మెయిన్స్ నుంచి ఆ ఇన్ స్ట్రూమెంటు కు కొన్ని తీగలు కనెక్షన్ గా ఇవ్వబడ్డాయి. గోపాలరావు క్షణం పాటు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి "మిస్టర్ పాత్రో - మీరింత పెద్ద పొరపాటు చేస్తారనుకోలేదు. ఇలా ఉండగా ప్రయోగం స్టార్టు చేస్తే కొంప మునిగిపోయేది" అన్నాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.