Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "బాగా గుర్తుంచుకున్నావు థాంక్స్, కూజా యించుమించు కాళీ అయిపొయింది. తీసుకెళ్ళు -- " అన్నాడు హంతకుడు.
    జనార్దనం కూజా తీసుకోబోతుండగా ఉలిక్కిపడ్డాడు. కూజా పక్కన పెద్ద ట్రంకు పెట్టె వుంది. ఆ ట్రంకు అస్తమాను గదిలో వుండదు. మర్నాడేవరినైనా నదిలో కలపడానికే.
    "సినిమా ఎలాగుంది?" అడిగాడు హంతకుడు.
    "ఏదో వుంది, నీకు తగిలిన బెరమేమిటి?"
    "నా విషయం నువ్వడక్కుడదు. నేను చెప్పకూడదు" ఒకవేళ నేను చెప్పకుండా తెల్సుకున్నావంటే అది నీకే ప్రమాదం" అన్నాడు హంతకుడు.
    జనార్దనం కూజా తీసుకుని బయటకు వెళ్ళిపోయి నీళ్ళు నింపి హంతకుడి గదిలో పెట్టేశాడు. కూజా గదిలో పెట్టేటప్పుడు జనార్దనం కళ్ళు వచ్చేముందు హంతకుడితో మాట్లాడుతున్న స్త్రీ మూర్తి కోసం వెతికాయి. కాని ఆమె ఎక్కడా కనబడలేదు. మంచం క్రింద దాగున్నట్లు లేదు. ఇంక రెండే రెండవకాశాలున్నాయి. ఒకటి ట్రంకు లో వుండి వుండాలి. రెండు - దొడ్డి వైపున వెళ్ళి వుండాలి . ఏమైనా జనార్ధనం ఆ విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచించ దలచుకోలేదు. ఎందుకంటె అది తనకు ప్రమాదం.
    రాత్రి అతనీ విషయాన్ని భార్యతో చర్చించాడు. అతను చెప్పిన వివరాలను సీత ఆశ్చర్యంగా వింది. ఈ హంతకుడిదివరలో కూడా ఇలాగె ఒకరింట్లో బస చేసి కొన్ని హత్యలు చేసి వెళ్ళాడు. ఇప్పుడా దంపతులకు కష్టం వచ్చింది. ఆదుకుంటానని ఇద్దరిలో ఒకరిని తనింటికి తీసుకొచ్చాడు. ఆ స్త్రీ స్థానంలో తను హోటలుకు వెళ్ళదలిచాడు. ఎటొచ్చీ ఈ విషయం తనకు తెలియడం అతని కిష్టం లేదు.
    మర్నాడుదయం లేచి కాలకృత్యాలు తీర్చుకోవడమయేక కాఫీలు తాగే సమయంలో "బావా నది ఒడ్డుకు రిక్షా బేరమాడి పెట్టాలి" అన్నాడు హంతకుడు.
    జనార్దనం ఉలిక్కిపడ్డాడు. "ట్రంకు కూడా ఉందా?" అనడిగాడు.
    "ఆహా!" అన్నాడు హంతకుడు.
    సీత ముఖం పాలిపోయింది. జనార్దనం కంగారుపడ్డాడు. చెల్లాయని పిలుస్తూ , రక్షణ ఇస్తానని నమ్మిస్తూ హంతకుడు ఆ స్త్రీని హత్య చేసేశాడు. ఈనిజం చాలా భయంకరంగా తోచింది.
    హంతకుణ్ణి పంపించేసేకే ఇద్దరూ హంతకుడి గదిని శోధించారు. గదిలో మంచం మీద ఇదివరకటి లాగే నోట్ బుక్ వుంది. అందులో మూడో నంబరు దగ్గర శారద పేరు రాసి ఇంటూ మార్కు వేసి వుంది. అక్కడే నాలుగు, అయిదు అంకెలు వేసి వున్నాయి.
    "ఈసారి రెండెంకెలు వేసున్నాయి" అంది సీత తడబడుతూ.
    "ఆ రెండూ మనమే అయినా ఆశ్చర్యం లేదు. ఈ హంతకుడికి రాగద్వేషాలు లేవు. మమతానురాగాలు తెలియవు" అన్నాడు జనార్దనం. సీత ఒళ్ళు జలదరించింది.
    ఆ నోట్ బుక్ లోనే శారద అడ్రస్ దొరికింది . ద్వారకా లాడ్జిలో పదకొండో నెంబరు గదిలో దిగారా దంపతులిద్దరూ.
    "ఎవరో గొప్పవాళ్ళే అయుండాలి కూడా పెంపుడు పిల్లి వెళ్ళడం ....' అంది సీత.
    "ద్వారకా లాడ్జిలో కాఫీ కలుపుకోవడానికీ , కోడి గుడ్లడక బెట్టుకోవడానికీ ఫెసిలిటీసుంటాయి" అన్నాడు. జనార్దనం సాలోచనగా , శారద భర్త మీద అతనికి సానుభూతి కలిగింది.
    ఆఫీసుకు వెళ్ళేముందు జనార్దనం ద్వారకా లాడ్జీకి వెళ్ళాడు. అక్కడ పదకొండో నెంబరు గదికి వెళ్ళాడు. తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. తోశాడతను, తెరుచుకున్నాయి. లోపలకు వెళ్ళాడు. ఎవరూ లేరు. కానీ, బాత్రూములోంచి మాటలు వినపడుతున్నాయి. ఒక కంఠం కాదు రెండు  ఒకటి మగ రెండవది అడ.
    జనార్దనం బాత్రూంవరకూ వెళ్ళాడు.
    "వాటీజ్ దిస్ డియర్ రాగానే బాత్రూం లోకి లాగేశావు" అంటోంది స్త్రీ కంఠం.
    "కాఫీ తీసుకుని బాయ్ గాడు వస్తాడు. బాత్రూం లో వుంటే ,మనకింక డిస్ట్రర్బెన్సుండదని...."
    కిలకిల నవ్వింది స్త్రీ . "నీలో రసికత నానాటికీ పెరిగిపోతోంది."
    'అవును నువ్వు పెంచుతున్నావు. అందుకే ఆ అడ్డు తొలగించుకోవాల్సి వచ్చింది."
    "నీకు నమ్మకంగా వుందా, అడ్డు తొలగించుకున్నట్లు" అడిగింది స్త్రీ.
    పురుష కంఠం నవ్వు వినిపించింది. "ముందు నేనే చంపెద్దామనుకున్నాను. కానీ అలా చేస్తే ప్రమాదముంది. నాకు తెలిసిన ఒక మనిషున్నాడు. అతనికి పని అప్పగిస్తే మనుషుల్ని యధాతధంగా మాయం చేసేస్తాడు. హత్య జరిగిన అధారాలుండవు. ఒక నెల రోజులు చూసి నేను నా భార్య గురించి పోలీసు రిపోర్టు ఇస్తాను. అయిదారు నెలలాగి నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
    "ఓ సిల్లీ" అందామె. ఆమె అలా అనడానికతని మాటలు కారణం కాదనీ, లోపల జరిగిన ఏదో సంఘటన అయుండాలని జనార్ధనానికి అర్ధమయింది. అతనింక అక్కడ నిలబదదల్చుకోలేదు. అతను వెనక్కు తిరిగేసరికి గుమ్మం దగ్గర బాయ్ ఎదురయ్యాడు.
    'అయ్యగారూ, అమ్మగారూ కలిసి ఇప్పుడే బాత్రూం లోకి వెళ్ళారు. నువ్వు మాట్లాడకుండా కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళు" అన్నాడు జనార్దనం. బాయ్ అతని వంకే ఆశ్చర్యంగా చూస్తుంటే అతనక్కడినుంచి బయట పడ్డాడు.
    జనార్దనం మనసు మనసులో లేదు. హంతకుడి గురించి అతని మనసులో రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి. ఆఫీసుకు వెళ్ళినా అతడు తన పని మీద దృష్టీ కేంద్రీకరించలేక పోయాడు.
    మధ్యాహ్నం లంచవర్లో ఫోన్ వచ్చింది. "హలో జనార్ధం స్పీకింగ్ " అన్నాడతను.
    "నేను లలితారాణి ని మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి నా దగ్గరకు రాగలవా నేరుగా మనమెప్పుడూ కలుసుకునే ఇంటికే వచ్చేసేయ్. చాలా అర్జంటు విషయం మాట్లాడాలి!" అందవతలి కంఠం.

                                                             12
    "ఇంకేన్నాళ్ళు నిన్నూరించను మిస్టర్ జనార్దనం! మనం కలిసి హాయిగా జీవించే రోజు దగ్గరపడింది " అంది లలితారాణి.
    'అంటే?"
    లలితారాణి నవ్వింది. 'చూడు - నువ్వా కుర్చీలో వున్నావు. నేనీ కుర్చీలో వున్నాను. ఇద్దరూ ఒకే కుర్చీలో వుండాలంటే నువ్వు కాస్త సాహసం చేయాలి."
    జనార్దనం మాట్లాడకుండా ఆమె వంకే చూస్తున్నాడు. లలితారాణి సౌందర్యం వర్ణనలకు లొంగేది కాదు. ఆమెను చూస్తుంటే వర్ణించాలనిపించదు. తాకాలనిపిస్తుంది. తాకితే అంతటితో అగాలనిపించదు, కానీ, లలితారాణి అలా ఆపుతోంది జనార్ధనాన్ని, అతనెన్నో మార్లామేను తాకడు. ఆమె కవ్విస్తే రెచ్చిపోయాడు. కానీ , అతన్నాట్లే దూరం రానివ్వలేదామె. హద్దుల్లో వుంచుతూనే వచ్చింది.
    లలితారాణి చెబితే తన వుద్యోగం వస్తుందని ఒకరోజు అనంతం చెబితే ఆమెను చూడ్డానికి వెళ్ళాడు. లలితారాణి అతనూహించినట్లు వయసు మళ్ళిన స్త్రీ కాదు. వయసులో తనకంటే చిన్నది. ఆమె అతనికి ఉద్యోగం ఇప్పించే ముందు చెప్పింది. "ఒక చిన్న షరతు. ఉద్యోగం వచ్చేక నువ్వు నేను చెప్పినపని చేయాలి. ఆ పని కష్టమైనదేమీ కాదు, నీవల్లన అయ్యేదే!"
    దొరకబోయే ఉద్యోగం చాలా మంచిది కావడం కారణంగా అతడు తల ఊపాడు. ఉద్యోగం దొరికాక లలితారాణి తన కోరిక చెప్పింది. "నాకు నువ్వు నచ్చావు . నేను నిన్ను కోరుతున్నాను."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.