Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి


   
    తన సంపాదనకీ పెళ్ళాం ప్రేమకీ గల రేషియో గుర్తించి
    స్తంభించి పోయాడు
    చర్చిముందు గుడిముందు మసీదుముందు
    చచ్చి గుట్టలుగా పడివున్న సత్యాన్ని చూసి తెల్లబోయాడు
    ఆచరణల నట్టడవిలో వేటాడి చంపిన
    ఆదర్శపు చుక్కల అందమైన జింకల్ని
    చూసి ఘొల్లుమన్నాడు
    ఇంగెర్సాల్ నీ షానీ మార్క్సునీ చలాన్నీ
    ఇంకా పనికిమాలిన వాళ్ళందర్నీ చదివి
    బొత్తిగా పాడై పోయాడు
    హార్టాపరేషన్ చెయ్యమంటూ
    ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నాడు
    మాఫలేషు కదాచన
    పరిత్రణాయ సాధూనాం
    Lead Kindly Light
    లాంటి మాటలు విన్నప్పుడల్లా
    "బాబోయ్ మోసం!" అని అరుస్తున్నాడు,
    నీతుల రగ్గులు కప్పుతున్నా చలి ఆగడం లేదు
    సూక్తుల కంబళ్ళు పరుస్తున్నా వణుకు తగ్గడం లేదు
    ఆదర్శాల పందిళ్ళు పరుస్తున్నా మంచు కురవడం మానడం లేదు
    సంప్రదాయాల కుంపట్లు రాజుకుంటున్నా వేడెక్కడం లేదు
    అయ్యో డాక్టరుగారూ చూపు సరిగా ఆనడంలేదు
    ప్రతి ఒక్కడిలో యిద్దరు ముగ్గురు మనుషులున్నారంటాడు.
    చీలిపోయిన మనుషులు శీలవతులైన మనుషులు
    చీనానుంచి చిలీదాకా
    చెదరి కొట్టుకు పోతూన్న బతుకులు
    బతుకుల చితుకులు, చితుకుల మంటలు
    సురిగిన గంటలు... అందర్నీ రమ్మంటాడు
    ఆర్పమంటాడు--ఫైరింజన్లకి ఫోన్ చేస్తాడు
    అయ్యా డాక్టరుగారూ
    అరెరే డాక్టరుగారూ
    హఠాత్తుగా సందికూడా వచ్చిందండీ
    ఏదో ఏదో వాగుతున్నాడు అర్ధంలేని పేలాపన
    వ్యాకరణం లేదు వాక్యనిర్మాణం లేదు
    సంధి విసంధి నియమాల్లేవు
    చక్కని ఉపమాద్యలంకారాల్లేవు
    సభ్యతలేదు, బజారుభాష వాడేస్తున్నాడు
    సత్యాన్ని సభలోపెట్టి వలువలు వొలుస్తానంటాడు
    సీక్రెట్ అని రాసిన గదులన్నీ తెరుస్తానంటాడు
    చూరులో దెయ్యాలున్నాయి




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.