Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఈ వెన్నెల నా మనస్సులోకి
జారుతోంది
నా గుండె పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థలాన
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీమా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్నీ
అర్ధాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచనగా తానైపోయింది
వెన్నెలవంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచిపోయింది
చలిచలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా వుంది
విరిసిన చేమంతి పువ్వులా వుంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా వుంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు వుంది
విరహిణి కన్నీరులా వుంది
విరజాజుల తావితో కలసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోకి కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యాను
భూతిక టీక



