Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ప్రతిరోజూ సాయంత్రం సముద్రం అలలమీద తేలే
అశ్వనీ నక్షత్రం పాడినపాట అందంగా మెడకు చుట్టుకొని
ప్రతిరోజూ అర్ధరాత్రి గుండెమీద ఏకాంతంలో ఎర్రగా వెలిగే
నిజం వజ్రాన్ని ఉంగరంలో పొదిగి నా వ్రేలికి తొడుక్కొని
ఊరూరా పాటలు పాడుకుంటూ తిరుగుతూ యీ వూరు వచ్చాను
ప్రభుత్వ భవనాలు పార్కులు మేడలు బార్లు కర్మాగారాలు
నల్లని పరదాలు కప్పుకొని బరువైన బీగాలు వేసుకొని
నాక్కనబడకుండా దాక్కున్నాయి
నన్ను రానివ్వకుండా మూసుకున్నాయి
కానీ, లోపల భయంకర సంతోష కోలాహలంతో
కవిగాయక వైతాళికి వంధిమాగధ విటకట్వాశ్లేషంలో
తనకి తనే వెరచి తనకి తనే మరచి
తందనాలాడుతోంది
ఎందుకిలా అడుగడుక్కి పోలీసులు అధికారపు బాలీసులు
ఏఁవిటి నీ వొంటిమీద నల్లనిమచ్చలు యీ తెచ్చికోలు నవ్వులు
ఓహోహో నగరశైలూషి సద్మసద్మ ఛద్మవేషి
ఏ పాపరహిస్యం నిను పీడిస్తున్నది?
ఏ విలువలు ఏ వెలుగులు నిన్నువదిలిపోయినవి?
ఆనాటి రాత్రి జిందగీ కీ మతలబ్ తెలియక తికమకగా
ఇన్సాన్ కీ మంజిల్ ఏమిటో ఊహించలేక బాధగా
అర్ధనిమీల నయనంలో అశ్రువే స్వప్నమై జారగా
అలాఅలా ఊరుచుట్టూ తిరుగుతూన్న నాకు హఠాత్తుగా
హుసేన్ సాగర్ లో తేలుతూన్న శవం కనబడింది
నా ఉంగరం మెరిసింది
"ఇది నగరం హత్యచేసి పారవేసిన ఆత్మ" అని పలికింది
బెదరే కన్నులతో చూసి చీకటిలో నగరం తలవంచుకొంది.
* * *
---1969
మన సంస్కృతి
మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం
మనగలిగినదీ



