Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
వాడినవ్వుల వాసన వేడివేడి పాదాలకు తగులుతుండగా
రోడ్లమీద అజ్ఞాతకామం ప్రతిరోజూ రాత్రి ప్రవహిస్తుంది
తెలుగువాళ్ళ తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్ళతోపాటు మోటుగా
యం.ఎల్.ఏ. క్వార్టర్స్ దగ్గర ఎబ్బెట్టుగా జీరాడుతుంది
దర్బారులో సిగ్గుల్నీ, వగల్నీ ఒలకబోసే నెరజానతనంనుండి
దాపరికంలేని పారిశ్రామిక నాగరికతా నగ్నత్వంలోకి
ఎదుగుతూన్న నగరసుందరిని ఒదులొదులుగా కౌగలించుకో
మదం, మదం, మృగమద పరిమళం మత్తెక్కిన కన్నుమూతలో
పెట్రోలు వాసన ఫెళ్ళుమని తగిలి ఉలిక్కి పడతావు
మూసీనది ముతకశృంగారాన్నీ, పాపకశ్మలాన్నీ
మౌనంగా, దీనంగా మోసుకుపోతూ వుంటుంది,
ముసలిగద్ద చార్మినార్ మీద గత వైభవాన్ని తలుచుకుని
మూలుగుతూ "మోసం!" అని అరుస్తుంది.
అయినా యౌవనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు.
మెహబూబ్ జిందాబాద్!
ప్యూడల్ రహస్యాల్ని నేటికీ దాచుకున్న
పుండ్రేషు కోదండం హైదరాబాద్!
* * *
---1956
నగరంలో హత్య
హైదరాబాద్ నన్ను గుర్తించలేదు పలకరించలేదు
పెద్ద పెద్ద వీధుల్లాంటి పైట సవరించుకుంటూ
తప్పుచేసిన ఆడదానిలా తప్పించుకు తిరిగింది
ఎదురుపడి నే పలకరించినా ఎత్తైన మేడల గర్వంతో
దురుసుగా నిర్లక్ష్యంగా దూసుకొని పోయింది
అనుమానంగా చూసి నన్నవమానించాలనుకుంది
నేనపరాధపరిశోధకుణ్ణి కాదు
నీ శత్రువులు పంపిన గూఢాచారినీ కాదు
నీ మొహబత్ కీరాత్ కి మోజుపడి వచ్చినవాణ్ణి కాదు
ప్రతిరోజూ ఉదయం ఎండలో అడవిలో తిరిగి తిరిగి
రకరకాల పిట్టల పాటల్నీ చెట్లు చెప్పిన కథల్నీ
సంచిలో నింపుకొని



