Home » VASUNDHARA » ఆపరేషన్ మేడిపండు
అయితే ఆమె కొడుకుని విసుక్కునేది కాదు. 'ఏవో నా నమ్మకాలు నావి. నా తృప్తి వాటిలోనే వుంది. ఇష్టంలేకపోతే మీరు వాటిని నమ్మకండి. పాటించకండి. అంతేకానీ నా జోలికి రాకండి' అనేది.
తల్లి అజేయ్ ఆదివారం నమ్మకాన్ని కూడా తీవ్రంగా సమర్థించేది. అందుకని అజేయ్ కామె అంటే ఇష్టం ఏర్పడింది.
అజేయ్ తల్లిలో ఇంకో విశేషమేమిటంటే అతడి ఆదివారం నమ్మకాన్ని సమర్థించినా- అంతకాలం తన మన్నకాల్ని నిరసించినందుకు ఉదాహరణగా ఇచ్చేది కాదు.
ఆమె నమ్మకాలను తర్కం లేకపోవచ్చు. కానే ఆమె సమర్థించడంలో రాజకీయమూ లేదు. ప్రతిఫలమాశించని తల్లి ప్రేమ ఆమెది!
డిస్కవరీ హేస్ కు డైరెక్టరైనాక-ఆదివారాలు ఆఫీసుకు వెళ్ళడం ఆజేయ్ కు తప్పని సరి. రోజంతా కాకపోయినా కనీసం కొన్ని గంటలుండి రావాలి.
నవంబరు30న టైము ఏదైనా ఆయనింకా ఆఫీసుకు బయల్దేరలేదు. ఇంట్లో పెళ్ళిచూపుల ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు.
సుమారు పదీఇరవైకి ఫోను మోగింది. అజేయ్ ఫోన్ తీశాడు.
సంభాషణ తనూ విందామని అజేయ్ భార్య స్పీకర్ ఫోను ఆం చేయబోతే, "వద్దు. అది ఆన్ చేయకు. ఇది చాలా పెద్ద రహస్యం. ఆ మాటలు నేనే వినాలి." అన్నాడు అజేయ్.
అజేయ్ భార్యకు ఆఫీసుకబుర్లు చాలానే చెబుతూంటాడు. అక్కడి రాజకీయల్లో ఆమె జోక్యం కూడా చేసుకుంటుంది. ఆమె సలహాలను అతడు తరచుగా పాటిస్తాడు. పాటించలేనప్పుడు సంజాయిషీ ఇచ్చుకుంటాడు. ఆయన జీవితంలో భార్యకు తప్ప ఇంకెవారికీ సంజాయిషీలు ఇచ్చుకోలేదు.
భర్త ఫోను తీయగానే స్పీకర్ ఫోన తీసి తనూ ఆ సంభాషణ వినడం ఆమె అలావాటు. అబ్యంతరపెట్టటం అజేయ్ కు మామూలేం కాదు కానీ- ఆదివారాలు మాత్రమే అప్పుడప్పుడలా జరుగుతూంటుంది.
ఆ సంభాషణలో ఆమెకాట్టే అర్థంకాని సైంటిఫిక్ రీసెర్చిపదాలు చాలా దొర్లుతూంటాయి. అందులో జోక్యం ఆమెకు బోరు.
అందుకని ఆ అభ్యంతరానికామె సంజాయిషీ కూడా అడుగదు. పైగా భర్త గురించి గర్వపడుతుంది. తనకర్థంకానివెన్నో ఆయనకు బోరు.
అందుకని ఆ అభ్యంతరానికామె సంజాయిషీ కూడా అడుగదు. పైగా భర్త గురించి గర్వపడుతుంది. తనకర్థంకానివెన్నో ఆయనకు తెలుసని!
అజేయ్ ఫోన్లో మాట్లాడేడు. అవతలిగొంతు ముత్యాలమ్మది. ఆమె రీసెర్చి స్కాలరు.
పరిశోధనలా ప్రయోగాలు కొన్ని ఆసక్తికరంగా వచ్చేయి. డిస్కషన్స్ అవసరంకారు పంపుతానందామె.
సాధారణంగా ఆదివారాలు ఆఫీసుకు వెళ్ళినా ఆఫీస్ కారే వస్తుందాయనకు.
ముత్యాలమ్మ బంధువులకు ట్రావెల్ ఏజన్సీ వుంది. అప్పుడప్పుడామె ఆ కారు బుక్ చేస్తూంటుంది. అప్పుడు డిస్కషన్స్ ఆఫీసులో జరుగవు.
"డిస్కషన్స్ ఆఫీసులో అయితేనే బాగుంటుందేమో?" అన్నాడు అజేయ్.
"నా అభిప్రాయంలో డిస్కషన్స్ అయ్యాక ఆఫీసుకు వెడితే బాగుంటుంది సర్"
అజేయ్ సరేనన్నాడు. పదిగంటలు ముప్పైఅయిదు నిముషాలకు కారోచ్చింది.
కారు అజేయ్ ను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకునివెళ్ళింది. ఆయన అనుమానించలేదు. ముత్యాలమ్మ అంటే ఆయనకు పూర్తి నమ్మకముంది.
నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది కారు. డ్రైవరు కారు దిగి బ్యాక్ డోర్ తెరిచి ఉన్నట్లుండి అజేయ్ మీద దాడిచేశాడు. అతడు అజేయ్ ని కొట్టలేదు. గాయపర్చలేదు. స్పృహ తప్పించడానికి ప్రయత్నం చేశాడు.
అలా జరుగుతుందని అజేయ్ ఊహించలేదు. అందుకు సిద్దపడి లేడు.
అజేయ్ కు స్పృహ వచ్చేసరికి ఈ గదిలో వున్నాడు. అప్పట్నుంచీ ఒకటే రొటీన్- బయట ప్రపంచంతొ ఏమాత్రం సంబంధం లేకుండా!
తనని ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ బందించారో , ఎవరు బందించారో తెలియని అయోమయంలో వున్నాడు అజేయ్.
ఇప్పుడు ఆలోచిస్తుంటే....
ముత్యాలమ్మ హస్తం ఇందులో వుండడానికి వీల్లేదని ఆయనకెప్పుడో తెలుసు.
కానీ తనను బందించినవారికి ముత్యాలమ్మ గురించి తెలుసు. ఆమెకూ తనకూ జరిగే డిస్కషన్స్ గురించి తెలుసు. ముత్యాలమ్మ పేరు చెప్పి తననిలా బంధించారు.
అంటే ఎవరో తనను అతిశ్రద్దగా గమనిస్తున్నారు. తన దినచర్యలా గురించి తెలుసుకుంటున్నారు. తనను బందించాలనుకున్నారు. కానీ ఎందుకు?
అజేయ్-ముత్యాలమ్మ పరిశోధనలా గురించి ఆలోచించసాగాడు.
* * *
డిసెంబరు11. ఉదయం ఏడుగంటలు.
అప్పటికి రాజింకా నిద్రలేవలేదు. చెప్పాలంటే అరగంటే క్రితమే అతడికి గాఢంగా పట్టింది. ఆనిద్రలో కల.
ఆ కలలో అతడు రాజుకాదు. జగపతిబాబు.
అతడు బ్రహ్మచారి కూడా కాదు. రాని అతడి భార్య. ఆమె ఆమనిలా లేదు. రాని లాగానే వుంది. రాని అంత సింపుల్ గానూ, సంతోషంగానూ వుంది.
అప్పుడు పాప వచ్చింది. కోటిరూపాయలిచ్చి అతణ్ణి కొంటానంది.
రాణికి ఇష్టంలేదు. కానీ రాజుకిష్టమైంది.
రాజు ఆడుతున్నాడు. పాడుతున్నాడు. రాని,పాప అటూఇటూ -వాళ్లూ పాడుతున్నారు, గెంతుతున్నారు. పాట తెలిసినది కాదు. 'శుభలగ్నమా-ఇది ఆశుభలగ్నమా, అంటూ ఏదో కొత్త వరసలో పాట కొనసాగుతోంది.
ఆ సమయంలో ఎవరో గదితలుపు తట్టారు.
రాజుకి కల కరిగిపోయింది. నిద్రాభంగమైంది.
అప్పుడు రాజుకు అర్థమయింది. పేదభార్యతో కాపురం చేస్తూండగా కోటిరూపాయలకో కోటీశ్వరికి అమ్ముడుపోవడం ఆమని తెచ్చుకున్న తంటాకాదు. అది మగవాడి కలలపంట. అతడి ఊహల వికృతరూపం.
'అప్పుడా సినిమా చూస్తూ జగపతిబాబుమీద జాలిపడ్డాను. ఇప్పుడు కరిగిపోగానే నామీద నాకే జాలిగా వుంది' అనుకున్నాడు రాజు.
అతడి కల ఎందుకు కరిగిందో గుర్తుచేయడానికన్నట్లుగా తలుపుమీద మళ్లీ టకటకమన్న చప్పుడు.
రాజు లేచి ఒళ్ళువిరుచుకున్నాడు. వెళ్ళి తలుపుతీశాడు.
గుమ్మంలో అపరిచితుడు-"లోపలకు రావచ్చా?" అన్నాడెంతో మర్యాదగా.
రాజు తడబడ్డాడు. తడబడుతూనే పక్కకు తప్పుకున్నాడు.
అపరిచితుడు పుల్ సూట్లో వున్నాడు. చూడగానే మంచి హొదాలో వున్నాడనిపిస్తుంది.
అతడు లోపల అడుగుపెట్టి తలుపు గడియ వేశాడు.
ఇద్దరూ చెరో కుర్చీలోనూ కూర్చున్నాక, "నా పేరు గజపతి" అన్నాడతడు.
రాజు ప్రశ్నార్ధకంగా అతడివంక చూస్తూనే. "అయాం రాజు" అన్నాడు.
"ప్రొఫెసర్ అజేయ్ ను ఎవరో దుర్మార్గులు అపహరించేరు. కేంద్రప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఆ సందర్భంగా నేను మిమ్మల్ని కలుసుకుందుకు ఇక్కడికి వచ్చాను"
అతడి మాటలు విన్న రాజు ఆశ్చర్యంగా , "ఇందులో నేను చేయగలింగిందేముంది?" అన్నాడు. ఆశ్చర్యంతోపాటు అతడి మనసులో కలవరం కూడా పుట్టింది.
దూరపుకొండలునునుపు. అది మరచిపోయి ఇంతకాలం తను ఐశ్వర్యం, పేరుప్రతిష్ఠల గురించి ప్రాకులాడుతున్నాడు. అజేయ్ కు అవన్నీ వున్నాయి. అవి దేనికి దారితీశాయి?
"కొంతకాలం క్రితం రాజమండ్రిలో ప్రొఫెసర్ కు సన్మానం జరిగింది. అక్కడ నాయుడమ్మ భవనంలో మీరు ప్రోపెసర్ని కలుసుకున్నారు. గుర్తుందా?" అడిగాడు గజపతి.
"గుర్తుంది. నేనే కాదు, ఇంకా చాలామంది ఆయన్ను కలుసుకున్నారు" అన్నాడు రాజు .
గజపతి చిన్నగా నవ్వి, "కానీ మీరొక్కరే ఆయన్ను కిడ్నాప్ గురించి హెచ్చరించారు" అన్నాడు.
రాజు ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటులో భయం కూడా రవంత కలిగింది.
"మీరాయన్ను కిడ్నాప్ గురించి హెచ్చరించడానికి కారణం చెప్పగలరా?"
"ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. ఆయన గొప్పతనం గురించి తెలియగానే అలా అనిపించింది. ఎందుకైనా మంచిదని చెప్పాను....."
"బాగా ఆలోచించండి. ఇంకేదైనా కారణం వుండివుండొచ్చు"
రాజు ఆలోచిస్తూనే, అ"అసలీ విషయం మీదాకా ఎలా వచ్చింది?" అన్నాడు.
"మీరమాట రహస్యంగా గదిలో నాలుగు తలుపులూ మూసుకుని అనలేదు. ఊరూ పేరూ లేని సామాన్యుణ్ణి గురించి అనలేదు. ప్రొఫెసర్ అజేయ్ అంతటివాడి గురించి పబ్లిగ్గా పదిమందిలో అన్నారు. కొందరు జర్నలిస్టులు మీ మాటలూ, వివరాలూ కూడా రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత అవి సిబిఐ దృష్టికి రావడం ఎంతసేపు?" అన్నాడు గజపతి.
"కానీ-నేనన్నది జస్ట్ -మామూలు మాట -అంతే!"
"ఇంతవరకూ మీరు మనదేశంలో ఏ సైంటిస్టైనా కిడ్నాపయిన వార్తా విన్నారా?"
"లేదు"
"అందుకే అది మామూలు మాట కాదు. బాగా ఆలోచించండి. ఏదో సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి మీచేత ఆ మాట అనిపించింది" అన్నాడు గజపతి.
రాజు తల పట్టుకున్నాడు. ఇకమీదట జీవితంలో ఎవరి గురించీ పొరపాటునకూడా రహస్యంగా అయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడకూడదనుకున్నాడు.
గజపతి రాజువంకనే సూటిగా చూస్తూ, "అదెంత చిన్న విషయమైనాసరే నిర్లక్ష్యం చేయొద్దు. మీరేక్కడో ఏదో చూశారు. లేదా ఏదో విన్నారు...." అంటూండగా-
రాజు "ఆఁ....గుర్తొచ్చింది" అన్నాడు అప్పుడతడికి నాయుడమ్మ భవనంలో తన పక్కన కూర్చున్న సైంటిస్టు గుర్తుకొచ్చాడు.
"చెప్పండి" కుతూహలంగా అన్నాడు గజపతి.
రాజు దియా సైంటిస్టు గురించి చెప్పాడు. నీటిని మూలపదార్థాలుగా విడగొట్టే అజేయ్ పరిశోధన గురించి చెప్పాడు. అదాయన వేదికమీద చెబితే ప్రమాదమనీ, అజేయ్ కిడ్నాప్ కావచ్చుననీ అన్నాడని చెప్పాడు.
"అతగాడెలా వుంటాడు?"
గుర్తుచేసుకుందుకు ప్రయత్నిస్తూ "పొడుగ్గా వుంటాడు. చామనచాయ, మాసినగెడ్డం, చురుకైన కళ్ళు...." అన్నాడు రాజు.
"ఇంకా....."అన్నాడు గజపతి.
రాజు ఆలోచించాడు కానీ ఇంకేం చెప్పలేకపోయాడు.
"పోనీ-అతణ్ణి చూస్తే మళ్ళీ గుర్తుపట్టగలరా?" అన్నాడు గజపతి.
"గ్యారంటీ ఇవ్వలేను. అతడి ముఖం అస్పష్టంగానే గుర్తుంది. మాసిన గెడ్డం చురుకైన కళ్ళు-ఇవి మాత్రం మరిచిపోలేకుండా వున్నాను...."
"మీరు అతణ్ణి గుర్తుపట్టాలి" అన్నాడు గజపతి.
"అయాంసారీ-గ్యారంటీ ఇవ్వలేను" అన్నాడు రాజు.
"మిస్టర్ రాజూ! మిమ్మల్ని కలుసుకోవడంవల్ల గొప్ప క్లూ దొరికింది. దియా అనబడే డిస్కవరీ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఏవో గొప్ప పరిశోధనలు జరుగుతున్నాయి.ఆ వివరాలు అంత తొందరగా బయట పెట్టడం ప్రమాదమని అక్కడి సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రొఫెసర్ అజేయ్ కిడ్నాప్ కాగలడని కొందరు సైంటిస్టులు భావిస్తున్నారు ఇప్పుడా సైంటిస్టులెవరో తెలుసుకోవాలి. కిడ్నాప్ కు కారణం తెలుసుకోవాలి.అప్పుడే అజేయ్ ని అపహరించినవారి ఆచూకీ తెలుసుకునేందుకు దారి ఏర్పడుతుంది"
"విష్ యూ బెస్టాఫ్ లక్ సర్" అన్నాడు రాజు.
గజపతి నవ్వి, "ఇందులో నేను చేసేదేముంది? అంతా మీరే చెయ్యాలిగా అన్నాడు.
"నేనా! అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"అవును-మీరే -దియాలో సైంటిస్టులను గుర్తించి వారి నుంచి తెలివిగా వివరాలు రాబట్టి మాకు అందజేయాలి"
"ఆ పని మీరైతే సమర్థవంతంగా చేయగలరు. నావల్లేమవుతుంది?"
"సైంటిస్టులు సామాన్యులు కారు. సిబిఐ పేరుతో వాళ్ళనుంచి ఒక్క రహస్యం కూడా రాబట్టలేము" అన్నాడు గజపతి.
"మీ వల్ల కాని పని నావల్ల ఎలా అవుతుంది?"
"ఏంచేయాలో నేను చెబుతాను. ఆ తర్వాత ఎలా అవుతుందో మీరే చూస్తారు.
"అయితే నేనేం చేయాలి?"
కోటుజేబులోంచి ఓ కవరు తీసి రాజుకు అందించాడు గజపతి.
రాజు ఆ కవరుమీద ఫ్రమ్ అడ్రస్ చూశాడు. అలాంటి కవరు ఒకటిగతంలో తనకు వచ్చింది. అది దియానుంచి.
రాజు కవరు చింపి- అందులోని కాగితం బయటకు తీసి చదివాడు.
అతడి ఆశ్చర్యానికి అంతులేదు. అది దియాలో రీసెర్చి చేయడానికి రాజు పేర అపాయింట్ మెంట్ ఆర్డరు. దియాలోనే హొటల్లో అతడికో సూట్ అలాట్ చేయబడింది.
"వి యూ బెస్టాఫ్ లక్" అన్నాడు గజపతి.
* * *
హాస్టల్ సూట్ లో ఓ డ్రాయింగ్ రూమ్, చిన్నవంటిల్లు, ఓ బెడ్ రూమ్వున్నాయి. బెడ్ రూమ్ కు అటాచ్డ్ బాత్రూముంది. ఇంకోపక్క చిన్న బాల్కానీ వుంది. ఇల్లంతా ఖరీదైనా ఫర్నిచర్ వుంది. వంటింట్లో కుకింగ్ రేంజి, మైక్రో ఓవెన్, రిఫ్రిజిరేటరు వున్నాయి.
రెండుగదుల్లో ఫ్యాన్లున్నాయి. వంటింటికి ఎగ్జాస్ట్ ఫ్యానుంది. మొత్తం సూటంతా స్టార్ హొటల్ని మించిపోయివుంది. కావాలనుకుంటే వెంటనే కాపురం పెట్టేయొచ్చు. లేదా హాస్టల్ మెస్సుంది. అక్కడ వందరూపాయల భోజనం పదిరూపాయలకు దొరుకుతుంది.
రాజు ఈ సదుపాయాలు చూసి తెల్లబోతున్నాడు.
ఇక లాబొరేటరీకి వెడితే-యూనిర్సిటీకీ ఇక్కడికీ ఎంత తేడా!
యూనివర్సిటీలో లాబొరేటరీలో అడుగుపెట్టెముందు అర్థవిహీనంగా పెరిగిన పచ్చగడ్డిని పలకరించాలి. కలుపుమొక్కల్ని దాటాలి. పెచ్చులాడుతున్న సిమెంటు మెట్లు ఎక్కాలి. ఇక్ష్వాకుల కాలంనాటి పరికరాలతో ప్రయోగాలు చేయాలి . టెస్టుట్యూబుతో సహా ప్రతి గాజుసామానూ లెక్కచెప్పాలి. హాట్ ప్లేట్లకూ, ఎయిర్ ఓవెన్లకూ ప్లగ్ పిన్నులు పగిలిపోతే-వైర్లనే ప్లగుల్లో పెట్టాలి. అలాంటి ప్రయోగాలు ఫలితాలు మాత్రం పాశ్చాత్యుల జర్నల్స్ లో ప్రచురించాలి.
ఇక్కడ లాబొరేటరీ ఇంద్రభవనంలా వుంది.
ప్రొఫెసర్ అజేయ్ దగ్గర రీసెర్చి స్కాలరుగా అతడి పేరు నమోదైంది. అందాకా అతణ్ణి సీనియర్ రీసెర్చి స్కాలరు సత్యానికి అప్పగించారు.
ఇంద్రభవనంలోకి సత్యమే రాజుని తీసుకునివెళ్లాడు. అతడికి వర్క్ ప్లేస్ చూపించాడు.
అందమైన పొడవాటి బల్ల. బల్లమీద అందమైన రాక్స్.
"ఇది ఓపెన్ చేస్తే గ్యాస్ వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ప్రెషర్ రిలీజవుతుంది. ఇది వాక్యూమ్ వా;వాల్వు...." సత్యం చెప్పుకుంటూ పోతున్నాడు.
మనదేశంలో రీసెర్చికి ఇంత చక్కటి సదుపాయాలుంటాయని కలలో కూడా ఊహించలేదు రాజు.
సత్యం అతడినోచోటకు తీసుకువెళ్లి "కుళాయి విప్పుతే డిస్టిల్ వాటర్ వస్తుంది" అన్నాడు
యూనివర్సిటిలో రీసెర్చి స్కాలర్స్ ర్వారి డిస్టిల్డ్ వాటరు వాళ్లు తయారుచేసుకుంటారు. అప్రమత్తంగా లేకపోతే ఒకరి డిస్టిల్డ్ వాటర్ మరొకరు కాజేస్తూంటారు. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్ చేయడానికి-నీళ్ళుండాలి, కరెంటుందాలి, హీటింగ్ మాంటిల్ పనిచేయాలి. ముందుజాగ్రత్త లేనివారికి ముష్టి తప్పదు.
సత్యం రాజుని తన టేబుల్ వద్దకు తీసుకునివెళ్ళాడు. దాన్నిండా తళతళా మెరుస్తున్నా గాజుసామాను బోలెడుంది.
"ఇంత సామానెందుకు తీసుకున్నారు-పగిలిపోతే?" అన్నాడు రాజు.
"ఇంకోటి స్టార్స్ నుంచి తెచ్చుకుంటాను"
"కానీ పగిలిందానికి డబ్బు కట్టోద్దూ..."
"ఇవి కన్సూమబుల్స్. వీటికి పగిలినా డబ్బు కట్టం"
"నేను నమ్మలేను" అన్నాడు రాజు.





