Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
కొనకళ్ళకు అక్షరాంజలి
మీతో పరిచయం స్వల్పం, మైత్రికి హృదయం ముఖ్యం
అందుకే మిమ్మల్ని బాగా ఎరుగుదునన్నది ఒక సత్యం
అక్షర లోకంలో మీరు వారగా నిలబడి పువ్వుల్ని పూస్తున్నప్పుడు
ఆ పక్కనుంచి వెళుతూ ఆఘ్రాణించి హాయి పొందినవారిలో నేనొక్కణ్ణి
కృత్రిమమైన మనసులూ మాటలూ కిచాటుగా నిండిపోయిన లోకంలో
నిజాయితీగా నిండుగా పలికే గొంతు నిజంగా ఎంతో అవసరం
సిన్సియారిటీ కవితా సుందరికి సీమంతం లాటిది
శివ సుందరాలకి సత్యం బేస్ లాంటిది
ప్రగాఢమైన అనుభవమూ ప్రకీర్ణమైన జలధారమూ మాత్రం
పరిశుభ్ర రసధారల్ని వర్షించగలవు
హృదయం ఉన్నవాడవు, అదునూ పదునూ ఎరిగినవాడవూ
కథలో కవితతో తెలుగుదనం, వెలుగుదనం కలిపి పంచిన వాడవు
కథంను లిఖామి మమ హృదయ ప్రమోదం,
సుఖితమా స్స్వతతఃశరదాం శతమ్.
* * *
---1971
పోయిన వజ్రం
ఉగాదికి నీకు ఏం వ్రాయను?
సగానికి సగం తియ్యని అబద్ధాలు
సరదాగా చెప్పనా
పరదాలో దాక్కున్న నిజాల్ని
బయటికి తీసి విప్పనా
అతృప్తాలైన కళ్ళు
ఆతృతతో అలసిన వొళ్ళు
అబద్ధంలో చుట్టబెట్టిన రాళ్ళు
ఏ భూమ్మీద కట్టుకోమంటావు
పొడి ఇసుకతో ఇళ్ళు
ఏ ఆకాశం మీద జల్లమంటావు
అడియాసల పుప్పొళ్ళు
ప్రతియేడూ సముద్రం వొడ్డున
పీతలు పండుగ చేసుకుంటాయి
ప్రతిగుండెలో ఏడుపు గట్లవార
పాటలు వినిపిస్తూ ఉంటాయి
నక్షత్రాల్ని కోసి సిగలో



