Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి


బయలులోన మెయిలులోన
బరువు బరువు అడుగులతో
పరుగులెత్తు యమదూతల
పదధ్వనుల ప్రతిధ్వనులు
హిరోషిమా
నాగసాకి
నగరస్మృతి చితాభస్మ
మెగిరిపడెను నా కన్నుల
జ్వలాత్కాష్ఠ

మిలాతలం
శప్తధాత్రి నిర్జనమై శ్మశానమై పరచుకొనెను
సుప్త దేవదేవ హృదయ సృజ్నాశము లెగిరిపడెను

నిలుము నిలుము
నిముషమాత్ర
మఖిల ప్రజా మరణగాధ
నావిష్కరణము చేయకు
కలసిరాదు
కాలమింక
అంకపాళి కోట్ల శిశువు లాఖరి కనుమూతలోన
దద్దరిల్లు మాతృహృదయం దారుణరోదన వినువిను
రాత్రికాదు
పగలుకాదు
చరమకాల విషమసంధ్య
చషకములో నర రుధిరము
సందిటలో
శివశిరస్సు
సకల దిశా జఠరవాంత శబలిత గంధక ధూమము
జరఠనిశా శిరోజాంతముల లయకీలావలయము
ఇది విలయము
ఇది నిరయము
అహస్కరుడు మరణించెను
విధుబింబము వ్రక్కలయెను
   
ఉల్క లెగిరి
ఒరసి మండె

విష జలధార గగనమ్ముల వేల్లిత పిశాచ గణములు
విష జలచర సముద్రముల విరిగిన శేషుని ఫణములు




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.