Home » Dr S V S Kishore Kumar » First Crush
విజి ఇండస్ట్రీస్ కి కొత్త సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఓనర్ తమ కంపెనీ విసిట్ చేస్తున్నాడు.
అతనితో లంచ్ మీటింగ్ అరెంజ్ చేస్తున్నట్లు ఆ ప్రాజెక్ట్ వినీల్ హెడ్ చేసేట్లు చెప్పాడు.
అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని మోస్ట్ ప్రెస్టీజియస్ అని నొక్కి వక్కాణించాడు.
ఓకే అన్నాడు వినీల్.
అప్పుడు గుర్తొచ్చింది విజి ఇండస్ట్రీస్ అంటే విజిత వాళ్ళది కదా అని.
ఒహ్హో. విజిత ఫాదర్ వస్తారు ఫార్మల్ మీట్ కి అనుకున్నాడు.
కారు పోర్టికో లో పార్క్ చేసి మళ్ళీ ప్రక్కకి చూసాడు.
కాఫీ తాగుతూ విజిత చిరు మందహాస దర్శనం. పక్కనే పెద్ద గోల్డెన్ రిట్రీవర్ కుక్క తిరుగుతోంది విజిత చుట్టూ.
చేతిలో కాఫీ కప్పు చూపించింది కావాలా అన్నట్లు చిలిపిగా.
ఊహూ అని అడ్డంగా తలూపాడు. లోపలికెళుతున్నట్లు చెయ్యూపాడు.
ప్రతిగా తానూ చెయ్యూపింది.
****
ఆ రోజు చాలా బిజీ గా ఉంది వినీల్ కి. ఒక వైపు ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యాలి. ఇంకో వైపు విజి ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్ట్ లంచ్ మీటింగ్.
రోజూ పదింటికి బయలుదేరే వాడు ఆరోజు కాస్త తొందరగా బయలుదేరాలని రెడీ అవుతున్నాడు.
ఇంతలో కాలింగ్ బెల్ మోత.
పనిమనిషి వచ్చి వెళ్ళింది కూడా.
ఇప్పుడు ఎవరై ఉంటారబ్బా అంటూ తలుపు తీసాడు.
ఓ అందమైన బుట్టలో మూడు బాక్స్ లతో ఓ వ్యక్తి నిలుచుని వున్నాడు.
ఎవరూ అని అడిగాడు కొత్త వ్యక్తిని.
పక్కింటి విజితమ్మ పంపారు సర్. మీకివ్వమన్నారు అని చేతిలో పెట్టి వెళ్ళాడు.
టిఫిన్ కాంటీన్ లో చేద్దామనుకున్నవాడల్లా ఇక తప్పేట్లు లేదని టేబుల్ పై ఆ బాక్స్ లు ఓపెన్ చేసాడు.
ఫస్ట్ బాక్స్ లో లాలి పాప్ కనిపించింది. అది చూసి నవ్వుకున్నాడు. చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. దానితో పాటు బెస్ట్ విషెస్ అని అందమైన దస్తూరితో ఓ చిన్న కలర్ స్లిప్ చుట్టి ఉంది.
ఇంకో బాక్స్ లో ఘుమ ఘుమ లాడుతూ వేడి వేడిగా సేమ్యా పాయసం, ఇంకో బాక్స్ లో నేతి పెసరట్టు.
కమ్మని ఇంటి వంటల రుచులతో టిఫిన్ కార్యక్రమం ముగించి చక చక మెట్లు దిగాడు.
ఇప్పుడు తప్పనిసరిగా పక్కింటి వైపు చూడాల్సి వస్తోంది. మామూలే.
ఓ అందమైన ఫ్లవర్స్ గుత్తి పట్టుకుని చేతులు ముందుకు చాపి అల్ ది బెస్ట్ అని చిరునవ్వుతో పలకరించింది విజిత.
బదులుగా థాంక్ యు అంటూ చెయ్యి ఊపి కారులో బయలుదేరాడు ఆఫీస్ కి.
ఆఫీస్ లో ఎంటర్ అవుతూనే ఓ పది అడుగుల ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అందులో తన నిలువెత్తు ఫోటో. కంగ్రాట్స్ టు బెస్ట్ ఎంప్లాయ్ అవార్దీ 'మిస్టర్ నీల్' అని రాసి ఉంది. కంపెనీలో అందరూ అతన్ని నీల్ అని పిలుస్తారు.
అందరూ చుట్టు ముట్టారు. బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అందరికి వినీల్ ప్రతి అభివాదం చేస్తున్నాడు.
కొందరు బొకే లు మరికొందరు అందమైన ఫ్లవర్స్ పట్టుకుని వరుసగా నిలుచుని ఉన్నారు.
వినీల్ అందరికి ప్రియమైన వాడు కావడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
బాస్ కూడా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు.
హార్టీ కంగ్రాట్స్ వినీల్. ఇది వరుసగా నాలుగోసారి అవార్డు నీకు రావడం. నీ ప్రతిభకు నిదర్శనం అని సంతోషించాడు. కేక్ కటింగ్ మధ్యాన్నం పెట్టుకుందాం అన్నాడు.
ఎస్ మృణాల్. ఇప్పుడు కోడింగ్ అప్లోడ్ చెయ్యాలి. మధ్యాహ్నం ఆ కొత్త ప్రాజెక్ట్ కి ప్రిపేర్ చేయించాలి అంటూ తన కేబిన్ వైపు నడిచాడు.
వర్కుహాలిక్. ఇలాంటి ఒక్కడుంటే చాలు ప్రతి కంపెనీకి అని మనసులో అనుకున్నాడు మృణాల్.
అనుకున్న టైం కి ముందే వినీల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ పూర్తయ్యింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
విజి ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ కి ప్రేపరషన్ ఓ నలుగురికి అసైన్ చేసాడు వారి వద్దనుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా.
అబ్బా అనుకుంటూ ఓ లార్జ్ కాఫీ తెప్పించుకున్నాడు రిలీఫ్ కోసం.
టైం చూసాడు. ఒంటి గంటయింది.
లంచ్ మీటింగ్ రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది.
ఇంతలో నాన్న నుంచి ఫోన్.
చెప్పండి నాన్న గారు. ఎలా ఉన్నారు. అమ్మ ఎలా ఉంది. అడిగాడు వినీల్.
అంతా బాగున్నామురా. నీవు పంపిన జాతకం సిద్ధాంతి గారికి ఇప్పుడే ఇచ్చి వస్తున్నా. ఇంతకూ ఎవరు వాళ్ళు అంటూ వివరాలు అడిగాడు.
వివరంగా చెపుతానండి. ముందు జాతకాలు సరిపోనివ్వండి అన్నాడు.
సరేరా. ఆయన రెండు రోజుల్లో చెపుతానన్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు.
సరే నాన్నగారూ. ఉంటాను మరి. రాత్రికి మాట్లాడుతాను అని పెట్టేసాడు.
****
అనుకున్న టైం రెండు గంటలకు పోర్టికో లో నాలుగు కారులొచ్చి ఆగాయి.
ముందున్న ఫారిన్ కార్ లో విజి ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత వెంకటరాజు గారు, వారి అమ్మాయి విజిత దిగారు.
వెనుక మూడు కార్లలో విజి ఇండస్ట్రీస్ స్టాఫ్ దిగారు.
మృణాల్ వారిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకొచ్చాడు.
చాలా పెద్ద ఎం ఎన్ సి సాఫ్ట్వేర్ కంపెనీ కావడంతో హైటెక్ సిటీ లో ఆ బిల్డింగ్ అన్నిటిలోకి మిన్నగా కనిపిస్తూ ఓ మోడల్ గా ఉంటుంది.
ఎంటర్ అవుతూనే పెద్ద రిసెప్షన్ హాల్, అందులో రిసెప్షన్ సిబ్బంది ఉంటారు.
వెంకటరాజు గారు లోపలి రాగానే ఆ పరిసరాలు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
మృణాల్ తో చాలా బాగుంది మీ మైంటెనెన్సు అన్నాడు.
మృణాల్ బదులుగా థాంక్స్ చెప్పాడు.
రాజు గారి కళ్ళు బెస్ట్ ఎంప్లాయ్ ఫ్లెక్సీ పై నిలిచింది.
కాసేపు ఆ ఫ్లెక్సీ వద్ద ఆగాడు.
ఎవరీ నీల్ అని అడిగాడు.
విజిత ఆ ఫ్లెక్సీ వైపు అలానే ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. చక్కని సూట్ లో వినీల్ మెరిసిపోతున్నాడు.
మృణాల్ వివరించాడు.
అతను వినీల్ సర్. గత నాలుగేళ్లుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకుంటున్నాడు. ఫారిన్ లో ఉంటూ డెప్యూటేషన్ మీద ఆరునెలల క్రితం ఇక్కడి కొచ్చాడు. ఇక్కడి వాళ్ళను ట్రైనింగ్ చేసేందుకు పిలిపించాము అని చెప్పాడు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చెయ్యబోయే టీం లీడర్ కూడా అతనే అంటూ చెపుతున్నాడు.
ఓహ్ వెరీ నైస్ అంటూ మెచ్చుకున్నారు రాజు గారు. కూతురి వైపు చూసాడు.
ఎస్ డాడ్. వెరీ నైస్ అంది విజిత మనసులో తెగ సంతోషపడిపోతూ.
సర్ ఫస్ట్ లంచ్ కు వెళదామా. తరువాత చిన్న డెమో ప్రెసెంటేషన్ ఉంటుంది అన్నాడు మృణాల్.
నో నో. ముందు మీటింగ్ అండ్ డెమో. తరువాత లంచ్ అన్నారు రాజు గారు. ఎంత సేపు ? గంటలో అవుతుంది కదా అని అడిగాడు.
ఎస్ సర్. గంట లోపే అవుతుంది అని బదులిచ్చాడు మృణాల్.
మీటింగ్ హాల్ కి రమ్మని వినీల్ కి కబురు పంపాడు.
రాజు గారు, విజిత, వెంట వచ్చిన విజి ఇండస్ట్రీస్ స్టాఫ్ మీటింగ్ హాల్ లో కూర్చున్నారు.
వినీల్ అతని బృందం మీటింగ్ హాల్ లోకి వచ్చారు.
ఫుల్ సూట్ లో వినీల్ సినీ హీరో లా మెరిసిపోతున్నాడు.
అతన్ని చూడగానే వెంకటరాజు చాలా ఇంప్రెస్స్ అయ్యాడు. ఇక విజిత ముగ్ధ మోహన అయ్యింది.
విజిత వస్తుందని ఊహించని వినీల్ ఆమెను చూడగానే ఒకింత ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో కలిగాయి. కళ్ళతోనే విజితని పలకరించాడు నవ్వుతూ.
మృణాల్, వినీల్ ని అతని టీమ్ ని పరిచయం చేసాడు.
వెంకటరాజు గారు కూడా తమ స్టాఫ్ ని పరిచయం చేసాడు.
కరచాలనాలు అయిన తరువాత ప్రత్యేకంగా తన కూతురు విజితని పరిచయం చేసాడు డాక్టర్ విజిత అంటూ.





