Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఈ నగరమ్మంతా తోరణమాలలు ధూపమ్ములు దీపమ్ములు
ఏబాధా నివారణకు ఏ వాంఛా పరిపూర్తికొరకు?
మీ మనోగత భావాలను తెలిసికొనగ నేనై వచ్చితి.
మీ రాజుని యీడిపస్ ప్రభువుని - సుప్రధిత కీర్తిని
(అక్కడున్న ధర్మకర్తతో)
ఓ పూజనీయుడా గుణవయోవృద్ధుడైన నీవే
వీరికి ప్రతినిధివై పలకగ లెస్సగ తగుదువు
ఏమిటి మీ కోరిక ఏటికి మీ కన్నులలో భయాందోళన
చెప్పండి హృదయంవిప్పి చేస్తాను శక్తివంచన లేకుండా
ఈ బహు ప్రజావాణిని నిర్లక్షించే నిర్ధయుణ్ణి కాను నేను
వీరందరికీ ప్రతినిధివై విన్నవింప తగుదువు
ఏమిటి మీ నివేదన మీ కన్నులలో ఈ భయాందోళన
నిర్ధయుణ్ణి కాదు నీరసుణ్ణి కాదు మీ ప్రజావాణిని
నిర్లక్షించే తెంపరిని కాను - చెప్పండి మీ మనోవ్యధ
పురోహితుడు:-
అవధారు మమ్మేలిన ప్రభూ అవధారు రాజా
పాలబుగ్గల పసినిసువులు జాలిగొలిపే వృద్ధులు
పరిపూర్ణ యౌవన సుందరసుమాలు యువకులు
ఇక్కడ బజారులో నగరమంతటా
పవిత్ర పల్లాస్ వేదికల వద్ద
ఇస్మిసస్ నదీతీరాన జ్వలించే దివ్యాగ్ని హోత్రాలవద్ద
సమావేశమైన హేతువును చిత్తగించండి ప్రభూ!
గుంపులుగా కూడిన మా గోడును ఈ కీడును
గమనించండి ప్రభూ
మృత్యువూ కాటకమూ మోహరించి నగరంపై నిలిచాయి
దారులన్నీ మూసి దారుణ వినాశోత్సవం చేసుకుంటున్నాయి
ఫలవంతమైన భూమి కడుపును కొట్టి
పచ్చని పచ్చికల చిచ్చు పెట్టి
తల్లి కడుపులో ఉన్నపుడే లేత లేత కందుల
ప్రాణాలకు చెల్లుకొట్టి
కోటికోరల కాటకం చెలరేగి
కోటిగొంతుల ఆర్తి మిన్నంటి పోవగా
ధర్మకర్త:- ప్రభూ
ఏలికవు మాకు దొరవు మాకు
ఎవరికింక చెప్పుకోము
పాలబుగ్గల పసివాళ్ళనుండి



