Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
రాత్రంతా నిశ్శబ్దపు వలలో తగుల్కొన్న పక్షులు
తటాలున విడిపించుకు ఎగిరిపోయినట్టు కువకువ
రాత్రికీ పగలుకీ మధ్య అంచుదగ్గర
రక్తం చిమ్ముతున్న కాలంలో వంకర
మోకాళ్ళపైకి మడతపడిన లంగా
నిద్రలోనే సవరించుకుంటూ
కలలో కుర్రాడి కౌగిలికి సంశయిస్తూ
సమ్మతిస్తూన్న సుందరి
రవిక దాచని రొమ్ములతో వెలకిలా పరున్న గృహిణిని
రహస్యంగా అసహ్యంగా చూస్తూన్న పాలేరు సింగడు
ఆకాశానికి చేతులెత్తి ఆక్రోశిస్తున్న ఫ్యాక్టరీ గొట్టం
హైరోడ్డుమీజ నలిగీ నలగని కంకరమీద లారీ
వెళ్ళిన గరగర శబ్ధం
దేవాలయం అరుగుమీద మేల్కొన్న ముష్టివాడూ
అతని కురుపు సలుపూ
రాత్రి క్లబ్బులో తప్పతాగి తందనాలాడి
వచ్చిన భర్త క్షేమానికి
తులసికోట చుట్టూ కన్నీటి దీపాలు
వెలిగిస్తూన్న యిల్లాలు
మిల్ ఓనరు కలలో మంటల రథంమీద
వస్తూన్న ఇన్ కమ్ టాక్సు ఆఫీసరు
వాడి కొడుక్కి రిట్జ్ లో రీటాతో
రాక్ అండ్ రోల్ చేస్తుండగా
కాలు విరిగినట్టు కల
నిద్రా జడత్వంలోంచి చీలిన మృత్యువులోకి
మేల్కొంటున్న నగరం
కట్టుతప్పిన నగరంలో పట్టుతప్పిన సంఘంలో
---------
యీడిపస్
రాజాంతఃపుర పురో భాగంలో మెట్లమీదా
వేదికలమీదా ధేబ్స్ నగరం జనులు గుంపులుగా
కూడి ఉంటారు.
మధ్యగా ఉన్న గుమ్మం నుండి యీడిపస్ వస్తాడు.
యీడిపస్:-ప్రజలారా నా ప్రజలారా కాడ్మస్ వంశీకులారా
ఏమిటి మీ నివేదన మీ దీనవదన ప్రార్ధనమ్ము



