Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
మనమ్మాయి అద్దం ముందు డ్రీమ గా నిలబడుతుందెందుకు?
ఇదిగో చూడు!
చెంపలు నెరిసినా అదేఁవిటి నీ మొహంలో ఏదో అందం!
సిగ్గుపడకిలా చూడు!
చిన్నప్పటి సరదాలూరికే జ్ఞాపకం వొస్తున్నా యెందుకు
చూరులో పిచ్చుక ఎంత ముద్దుగా చిలిపిగా గంతులేస్తోందో
చూడిటు గోరింట పువ్వింత అందంగా వుంటుందని నాకు తెలవదు!
గది ఏమిటో బోడిగా వుంది చక్కని డిజైన్ గల టేబిల్ క్లాత్ కొంటా
నుండు.
ఈ రాత్రి పడగ్గదిలో అగరొత్తులు వెలిగించి ఉంచు సుమీ! హాయిగా
వుంటుంది!
గుసగుసలాడుతూ వస్తున్న గాలి పైట తొలగిపోయినట్టుందేఁవిటి మల్లె
చెట్టు!
ఆడదానిలా వుందేఁవిటి ప్రకృతి.
-------
గ్రీష్మం
పంకా కింద బద్ధకంగా పడుకున్నాను
బద్ధకంగా బెంగగా పడుకున్నాను
గది అవతల స్టెయిన్ లెస్ స్టీలు రేకులా ఎండ
చెట్టు మొదల దాహంతో నోరు తెరిచిన తొండ
విరహంలా వేడి గాడ్పువీస్తోంది
విచిత్రంగా మనస్సు భ్రమిస్తోంది
ఇవి గ్రీష్మ ప్రధమ దివసాలైనా
ఇంకా వసంతపు గడుసుతనం వేధిస్తోంది
తలుపులు మూసుకున్న గదిలో నాలో
--------
వేకువ
రాత్రిని రంపంపెట్టి కోసినపుడు
రాలిన పొట్టులాగుంది వేకువ



