Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
మూడు సముద్రాల కెరట కెరటాల నీలాల
మోహన వస్త్రం దొలిచి
మౌళి మీద హిమసుందర కిరీటం ధరించిన
రాజ్ఞినా భరతధాత్రి అనుకోవడం ఒక నిజం!
అదొక సుఖం.
మూడు సముద్రాలు మూసిన కోసిన తీరంతో
ముగ్గు బుట్టలాంటి తలమీద కొండంత బరువుతో
మూల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం
మరో నిజం అదో దుఃఖం
ఇదీ నిజం అదీ నిజం
రెండింటికీ రుజువులు సమం
శ్రీరాముడి శ్రీకృష్ణుడి జన్మభూమి మరి
కంసునికీ దశకంఠునికీ కాదా?
--------
సమాజం
ఒక ఆకైనా పండబారి రాలిపోతూన్న వైనం
చెట్టుచెట్టంతకీ తెలుసు కాని చెప్పదు చెప్పలేదు పైకి
ఒకడు తప్పిదం చేస్తే చాలు దాని వెనుక నిలిచి ఉంది
సమాజం సమాజం అంతటా గుప్తంగా ఉన్న
కుటిల బుద్ధి స్వభావం.
---------
నిజాలు
ఉదయపు నీరెండలో నిలిచి శిరోజ సౌఖ్యాన్ని
దువ్వెనతో మంచుబాలను చూసి
ఉషఃకుమారివి నీవని ప్రశంసించు---
అది అందమైన నిజం
దారిలో ఎదురైన అంధుడిని గాంచి,
తడబడుతూ నడుస్తూన్న అంధుడినిచూసి
చీకటి నీ తల్లి అని చెప్పకు సుమా---
అది కటువైన నిజం.
-------
వసంతం



