Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అనంతమైన నా ప్రేమ నిరూపిస్తానని ప్రతిజ్ఞ చేసి
ఆ రాత్రి వెళ్ళిపోయాను నేను
అలా నగరాలకి నగరాలు దాటి అడవుల్ని దాటి
ఆకాశ నక్షత్రాలను మీటి అనంత దిగంతాలు వెతికి
ఎక్కడెక్కడ ఒక్కణ్ణీ తిరిగానో రాత్రి ఏకాంతంలో
ఎక్కడ చూసినా దీన నయనాల ప్రశ్నలు
మౌన విశ్వాసాల పిలుపులు బావురుమనే గుండెల ఏడ్పులు
బాధల సలసల కాగే బ్రతుకులు.
ముసలిదైపోయింది భూమి
ముసలిదైపోయింది భూమి
మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని
ముసురుకున్న బాధల వానకారులో
మసలుకొనే దెలా చివరికంటా
మసిబారింది చూపు
ససి చెడింది రూపు
సముద్రం సన్నిధిని కన్నీరు పెట్టుకుని యేడ్చింది
సాగర భ్రాత కెరటాల గుండె
హోరుహోరున మ్రోగింది
ముసలిదైపోయింది భూమి
మోయలేని తన వయస్సు
మొత్తం కొన్నివేల యేళ్ళ బరువు
ముడుచుకొని పోయిన తన వొడలి ముడత
లెన్ని స్మృతులకెన్ని కథలకి తెరువు
ఏనాటి దామాట
ఎప్పటిదా ఆటపాట
పచ్చని తన పడుచుదనం మీద
వెచ్చగా పడిన
ప్రధమ సూర్యోదయాశ్లేషానికి
పులకరించి
చెంగలించి పరవశించి
అగ్నిపర్వతాల లాటి కాంక్షలు రేగి
అంబోధి వెడల్పు ఆశలెదలోన మ్రోగి
కొండల కోనల సెలయేళ్ళ సరదాలతో
కూరుములు నింపుకున్న నవజీవన హేలతో
------
నా భరతధాత్రి



