Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
నేనూ అలాంటి వాటిమీద ఏదో చెప్పగలను
రాయగలను. కాని అవి అంటే నాకు
గొప్ప చిరాకు
నా కన్న ఓర్పు ఉన్నవాళ్ళు, బుద్ధిమంతులు
వాటిని గూర్చి విపులంగా సూక్ష్మతర
పరిశీలనతో రాస్తూనే ఉన్నారు.
సృష్టియొక్క రహస్యం స్రష్టికి తెలియక
పోవడమే విచిత్రం అద్భుతం, అద్భుతం విచిత్రం
"ఇలాంటి పిల్లాణ్ణి ఎందుకు కన్నావు---
ఏయే మార్పులు శక్తులు, నీలో పనిచేశాయి"
అంటే ఏ తల్లీ చెప్పలేదు
ఏ ద్రవ్య సంయోగం వల్ల ప్రాణం కలుగుతుంది
ప్రాణానికి ఏ రూపం కావాలో ఏ రూపం సరి
పోతుందో ప్రాణమే నిర్ణయించుకుంటుంది.
శరీరం ముందుగా ఏర్పడి దాన్లో ప్రాణం
దూరి కూర్చోదు.
"కొన్ని వందల ఏళ్ళనుంచి పద్యం వుందికదా
ఛందస్సులున్నాయి కదా వీటిని వొదిలిస్తున్నావేం"
-(అసంపూర్ణం)
నిన్న రాత్రి వర్షంలో
నిన్న రాత్రి వర్షంలో తడిసి నీ గుమ్మం తట్టనపుడు
నిదుర కళ్ళతో చూసి జాలిగా నవ్వి రమ్మన్నావు
నా కళ్ళల్లో తడిసిన చీకట్ల మధ్య చంద్రవంక విరిగి
నా గుండెల నంటుకొన్న షరాయి మీద పుప్పొడి చెరిగి
నేను సిగ్గుపడి తలొంచుకొని నీకేసి చూడకుండా
గబగబా నా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను
ఎక్కడెక్కడ ఒక్కణ్ణీ తిరిగానో రాత్రి ఏకాంతంలో
ఎన్ని దీన నయనాల్ని ఎన్ని మౌన విశ్వాసాల్నీ
ఏరుకున్నానో చటుక్కున నా సంగీతం ఆగిపోయి
అపూర్వమైన నా సంగీతాన్ని తెచ్చి నీకు కానుకగా యిస్తానని



