Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి


   
    పైగా నామీద నన్నే రాసుకోమన్నారు-నాకు
    రాయాలనిపిస్తే.
    ప్రతీ కవిత్వమూ కవి తనమీద తాను రాసు
    కొన్నదే ఓ విధంగా ఎందుకంటే కవిత్వం
    అల్టిమేట్ గా సబ్జెక్టివ్ గదా
    నా కవిత్వంలో నేను దొరుకుతాను

               ***       
    ప్రబంధాలూ తద్గత వర్ణనలూ చదువుకుంటూ
    అలాంటివే రాస్తూ కూడా ఏదో తృప్తీ ఆనందమూ
    పొందలేక ఇంకా ఏదో నాకు తెలీనిదేదో
    ఉందనుకునే బాల్యంలో
    ఒక మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ
    వృక్షచ్ఛాయలో మొదటిసారిగా దేవుల
    పల్లి కృష్ణశాస్త్రిగారు తమ ఊర్వశీ ప్రవాసం
    లోంచి
    వివరాలీ విభావరీ వేళాశాలల
    నీ మసలు చరణ మంజీరము గుసగుసో
    అన్న గేయం విన్నప్పుడు
    చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ
    బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా
    వూరి రోడ్ల దుమ్మూ అన్నీ మాయమై పోయి
    నేను నాలోంచి కదలిపోయి జాలిజాలిగా
    గాలిలో చిరుచీకటిలో నక్షత్రాల చిరుకాంతిలో
    కలిసిపోయి ఏదో ఏదో అయిపోయిన క్రొత్త
    చైతన్యంలో ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు
    ఆ తర్వాచ కొన్నాళ్ళకు ఒక పల్లెటూరి పొలి
    మేరలో నన్ను నిలబెట్టి ఒక విప్లవ యువకుడు
    శ్రీశ్రీ కవితా ఓ కవితా తన గంభీర కంఠంతో
    వినిపించినపుడు లక్ష జలపాతాల పాటలూ
    కోటి నక్షత్రాల మాటలతో పాటు రాజ్యాలూ
    సైన్యాలూ విప్లవాలూ ప్రజలూ శతాబ్దాలూ
    నా కళ్ళముందు గిర్రున తిరిగి నేను చై
    తన్యపు మరో అంచుమీద నిలిచాను.

                        ***
    కవిత్వం మారిపోయింది. కవితా స్వభావం మారిపోతోంది.

                         ***
    ......అయితే యింక టెక్నిక్ మీద వచన
    కవితారూపం మీద ఇలాంటి వాటిమీద
    రాసుకోవాలి.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.