Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అందుకే అనాదిగా చరిత్రకి పునాదిగా
పొందుపరిచారు జాతికీ వ్యక్తికీ స్వతంత్రం
అందంగా అందర్నీ సమంగా వాడుకొమ్మన్నారు
అది కాదని వాదుకు సిద్ధమయితే
యుద్ధానికి కాలుదువ్వితే
ఊరుకునే చవట ఈ కాలంలో ఎవడు?
ఉరుకుతాడు ముందుకి సింహంలా నరుడు
చివ్వకు ప్రతి భారతీయుడూ ఒక కవ్వడి
గవ్వకు మారడు శత్రువు వాడెవడైనా.
ఇకనుంచైనా చైనా బుద్ధిగా మెలగకపోతే
క్రకచం వంటి ప్రజాబలం కంఠాన్ని కోస్తుంది
సకల ప్రపంచం సంఘటితమై ఎదురిస్తుంది
మునుపటివాళ్ళం కాదు ముసలివాళ్ళం కాదు
మొనదేరిన బాకులమై మోహరించి నిలుస్తాం.
ప్రతి సోల్జర్ ఒక శతఘ్ని
ప్రతి పౌరు డొక దవాగ్ని
ప్రతినబూని నిలబడు నిటారుగా
బ్రతుకెందుకు స్వతంత్రం పోవగా
ఇదే అదను పదను పెట్టు
పదే పదే యెద మొహదా
మనదేశం మన స్వప్నం
మరచిపోకు వెరచిరాకు
మనిషికి ఒకేసారి మరణం
* * * ---ఆంధ్రప్రభ వారపత్రిక, 1962
నా కవిత్వంలో నేను దొరుకుతాను
నీ కవిత్వం పుస్తకానికి ఎవరిచేతా పీఠికా పరిచయమూ
వగైరాలు రాయించవద్దు అన్నాడు-
నాలుగేళ్ళ క్రితమే నా చిరమిత్రుడు శ్రీపాదకృష్ణమూర్తి
సరీగ అలానే అన్నాడు నా యువమిత్రుడూ కవీ
వేల్చేరు నారాయణరావు కూడా
నాకన్న పెద్దవాడూ నన్నభిమానించేవాడూ
శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావుగారు కూడా
అలాగే అన్నారు



