Home » Dr S V S Kishore Kumar » First Crush
ఆయనకు ఇంకా స్పృహ రాలేదు.
ఎలాగూ బ్యాండేజ్ కి అనెస్తీషియా ఇవ్వాలి.
అప్పటివరకు మత్తు ఇంజక్షన్ పని చేస్తోంది.
మెలకువగా ఉంటె ఆ నొప్పి ఆయన భరించలేరు.
రాజుగారి వెంట ఆపరేషన్ థియేటర్ లోకి విజిత వెళుతుంటే సీనియర్ డాక్టర్ నువ్వెందుకులేమ్మా. మేమంతా ఉన్నాంగా. నువ్వు మీ మమ్మీకి తోడుగా ఉండు అని చెప్పాడు.
తానేమైనా కంగారుపడతానేమోనని ఆయన అన్నట్లు తోచింది విజిత కి. అందుకే లోపలికి వెళ్లకుండా ఆగిపోయింది.
బెడ్ పై పడుకోనున్న వినీల్ ని ఎవరు అతను అని అడిగింది విజిత తల్లి.
అతను వినీల్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి మమ్మీ. డాడీ వాళ్లకి సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళ కంపెనీ కి వెళ్ళాము.
మధ్యాహ్నం అక్కడ మీటింగ్ తరువాత డాడీ మన ఫ్యాక్టరీ కి వెళుతుంటే ఆక్సిడెంట్ జరిగింది.
నేను మరికొన్ని వివరాలకోసం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ లోనే ఉండిపోయాను.
నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వినీల్ తో మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను.
అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. లక్కీ గా డాడీ కి అతని బ్లడ్ గ్రూప్ సరిపోయింది. ఒక విధంగా దానివలన డాడీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటూ వివరించింది విజిత.
తమ ప్రేమ గురించి చెప్పలేదు. ఆ సమయంలో అలాంటివి ఎందుకని మిన్నకుండిపోయింది.
తన తండ్రి ఆరోగ్యం ముఖ్యం. ఆయన సేఫ్ గా డిశ్చార్జ్ అవ్వాలి అనుకుంది.
ఓహ్ అతను చాలా హెల్ప్ చేసాడు విజ్జీ. అతనికి థాంక్స్ చెపుదాం అంటూ వినీల్ బెడ్ వద్దకు వెళ్ళింది మాధవి.
ఆవిడ వెంటే విజిత కూడా వెళ్ళింది.
వినీల్ కి సెలైన్ పెట్టడం పూర్తయ్యింది. నర్స్ వచ్చి స్టాండ్ అవి తీసేసింది.
ఎలా ఉంది నీల్ అంది విజిత.
ఫీలింగ్ మచ్ బెటర్. సెలైన్ పెట్టక ముందు కొంచెం రీలింగ్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఉంది అన్నాడు.
నీల్ మా అమ్మ మాధవి అని పరిచయం చేసింది.
ఆవిడ రెండు చేతులు జోడించి చాలా సహాయం చేసావు బాబు. ఆయన ప్రాణం కాపాడావు అంది.
అయ్యో అదేంటండి. లక్కీ గా సర్ ది నాది ఒకే బ్లడ్ గ్రూప్. అందుకే నాకు ఆ అవకాశం వచ్చింది అన్నాడు. ఇదిగో ఇది సర్ ఇచ్చారు మధ్యాహ్నం అని బ్రాస్లెట్ చూపించాడు మాధవికి.
నీల్ ప్రతిభకు డాడీ ప్రెసెంట్ చేసారమ్మ అని చెప్పింది విజిత తల్లితో.
వినీల్ బాస్ మృణాల్ అతనితో పాటు ఆఫీస్ వాళ్ళు ఓ పది మంది వచ్చారు వినీల్ ను చూసేందుకు.
వాళ్లందరినీ చూస్తున్న మాధవి కి విజిత చెప్పింది అతని కంపెనీ వాళ్ళు అని.
అందరూ విజితని పలకరించారు రాజు గారికి ఎలా ఉందని.
అందరికీ వివరంగా చెప్పింది విజిత.
వినీల్ ని అందరూ అభినందించారు బ్లడ్ డొనేట్ చేసినందుకు.
వినీల్ టీంమేట్ మీనూ ప్యాక్ చేసుకొచ్చిన ఫ్రెష్ ఫ్రూప్ జూస్ ను అందరికీ ఇచ్చింది.
నీల్ కి ప్రత్యేకంగా తనే తీసుకెళ్లి తాగించబోయింది.
హే నో నో. ఐ యాం ఫైన్ అంటూ బెడ్ మీంచి లేచి నిలుచున్నాడు వినీల్.
మీనూ ఇచ్చిన జూస్ గ్లాస్ అందుకుని సిప్ చేస్తున్నాడు.
ఈ మూడు రోజుల్లోనే వినీల్ తనకు, తన ఫామిలీ కీ బాగా దగ్గరవుతున్నట్లు అనిపించింది విజిత కి.
అతన్ని చూస్తే తనకి కొండంత ధైర్యం. ఎంతో ఉత్సాహం వస్తుంది.
వీర్రాజు గారు అతనితో పాటు మరికొందరు రూంలోకి వచ్చారు. వారికి కూడా జూస్ ఇచ్చింది మీనూ.
విజిత పెదనాన్నకి చెప్పింది డాడీ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లినట్లు.
ఇంకో గంట పడుతుంది బ్యాండేజ్ వేసేందుకు అని చెప్పింది.
మీరు వెళ్ళండి పెదనాన్న. మీరు అలిసిపోయారు. నేను మమ్మీ ఉంటాము. వినీల్ ని కూడా రిక్వెస్ట్ చేసాను. అతనూ తోడుగా ఉంటానన్నాడు అంది.
కానీలేమ్మా. వాడు బయటికి వచ్చిన తరువాత చూసి వెళతాను అన్నాడు. ఆయన బాగా దిగులుగా ఉన్నాడు తమ్ముడికి అంత పెద్ద ఆక్సిడెంట్ అవడంతో. కాకుంటే ప్రాణాపాయం తప్పినందుకు ఆయనకి కొంత ఊరట కలిగింది.
సరే పెదనాన్న. మీరు ఇప్పుడు వేసుకోవలసిన మెడిసిన్ ఏమైనా తెప్పించమంటారా అని అడిగింది.
అర్జెంటు లేదురా. ఇంటికి వెళ్లి వేసుకుంటాను అన్నాడు ఆయన.
వినీల్ తనతో తెచ్చిన బాగ్ లో తన లాప్టాప్ తీసి మెయిల్స్ కి రిప్లై ఇస్తున్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చుని.
మీనూ అతని చేతిలోంచి లాప్టాప్ లాక్కుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో. ఎప్పుడూ పనేనా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం అంది.
ఓహ్ సారీ సారీ అన్నాడు.
అంతలో కమీషనర్ అఫ్ పోలీస్ అతని వెంట నలుగురు పోలీస్ ఆఫీసర్స్ ఆ రూంలోకి వచ్చారు.
వస్తూనే వినీల్ ని చూసి హే వినీల్ నువ్వెంటి ఇక్కడ అని అడిగాడు కమీషనర్ అఫ్ పోలీస్ యశ్వంత్. వినీల్ అన్నయ్య, యశ్వంత్ ఇద్దరూ క్లాస్మేట్స్. వినీల్ అన్నయ్య ఐ ఏ యస్, యశ్వంత్ ఐ పి యస్.
హలో యశ్వంత్ నేను రాజు గారిని చూసేందుకు వచ్చాను అన్నాడు.
ఇక్కడ రాజు గారి ఫామిలీ మెంబర్స్ ఎవరు అని అడిగాడు.
విజిత, మాధవి, వీర్రాజు గారి వైపు చూపించాడు వినీల్.
మీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి అన్నాడు యశ్వంత్ వాళ్ళతో.
తప్పకుండ అన్నారు వీర్రాజు.
ప్రక్క రూమ్ కెళదాం అని దారితీసాడు. ఆయన్ని అనుసరించారు విజిత మాధవి.
యశ్వంత్ వినీల్ ని కూడా రమ్మన్నాడు.
వినీల్ కూడా వెళ్ళాడు వాళ్ళతోటి.
****
ఆ రూములో రాజు గారి ఫామిలీ, వినీల్, పోలీస్ ఆఫీసర్స్ తప్ప ఇంకెవరూ లేరు.
అప్పుడు చెప్పాడు యశ్వంత్ రాజుగారి పై హత్యా యత్నం జరిగిందని. అది ఆక్సిడెంట్ కాదని.
అందరూ ఒక్కమారు ఉలిక్కిపడ్డారు.
ఆరునెలల క్రితమే వెంకటరాజు గారిపై ఒక మారు ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ ఆరోజు తృటిలో తప్పించుకోవడం జరిగింది. ఆయనకీ అనుమానం వచ్చి తనకు బాగా పరిచయం ఉన్న రాష్ట్ర డీ జీ పీ కి చెప్పాడు. అప్పటినుంచి రాజు గారు ఎక్కడకు వెళుతున్నా ముందే పోలీస్ ఫోర్స్ కి ఇన్ఫోర్మ్ చేసేవారు. వాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు.
ఈ రోజు మరలా అదే ప్రయత్నం జరిగింది. నార్సింగి జంక్షన్ దగ్గర వెనుకనుంచి పెద్ద ట్రక్ తో గట్టిగా ఆయన కారును గుద్దబోయారు. డ్రైవర్ చాకచక్యంగా కొన్చమ్ పక్కకు తిప్పాడు. అందుకే పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోవలసివచ్చేది.
మాధవి విజిత చాలా భయపడ్డారు ఆ మాటలు విని. రాజు గారు ఎప్పుడు ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు భయపడుతారని బహుశా చెప్పలేదు.
వీర్రాజు కి కూడా భయం వేసింది తమ్ముడిపై హత్యా యత్నం అనేసరికి. ఆయన యశ్వంత్ ని అడిగాడు. ఎవరినైనా పట్టుకున్నారా ఈ విషయంలో అని.
ఎస్ సర్. ఆ ట్రక్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నాము.
అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపాము.
వెంకటరాజు గారికి ముఖ్య శత్రువు ఒకతని పేరు చెప్పాడు.
అతనిపై ఆరు నెలలనుంచే నిఘా ఉంచాము. వారిపై కూడా కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తున్నాము.
రాజు గారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయనతో డిస్కస్ చేసి కేసు ని ముందుకు తీసుకెళతాము.





