మురికి నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటి వారికి అరిష్టం

 

 

information of why married women should not clean feet with clothes washed water

 

 

ఎండాకాలం, నీటి కరువు. నీళ్ళు మిగుల్చుకోవడానికి ఏదైనా మంచిదే అన్నట్టు వ్యవహరిస్తుంటాం. అలా బట్టులుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసేసుకుంటారు కొంత మంది ఆడవాళ్ళు. అలాగే బట్టలు ఉతికిన తరువాత కొంత మందికి ఆ అలవాటు కూడా ఉంటుంది. అయితే ఇది పుట్టింటికి అరిష్టం అని కొన్ని సార్లు ఇంట్లో పెద్ద వాళ్ళు వారిస్తుంటారు. అది అవుననే చెప్పాలి. మురికి పట్టిన బట్టల నీటిని కాళ్ళ మీద పోసుకుంటే అరిష్టం అది ఎలాగంటే...

 

 

information of why married women should not clean feet with clothes washed water

 

 


వందలో తొంభై మంది మధ్య తరగతి, క్రింద తరగతి స్త్రీలలో కాళ్ళ పగుళ్ళు సాధారణంగా ఉంటూనే ఉంటాయి. వీరిలో చాలా ఎక్కువ మంది కుటుంబానికి తప్ప తమ అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వరు, జాగ్రత్తలు పాటించరు. అలా జాగ్రత్తలు తీసుకోక పోగా, ఇలా మురికి నీటిని కాళ్ళపై పోసుకోవడం వల్ల అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. ఆపై ఆడపిల్ల కష్టాలు చేరేది పుట్టింటికే.

 

 

information of why married women should not clean feet with clothes washed water

 

 


కూతురు ఆనందంగా, ఆరోగ్యంగా పుట్టింటికి వస్తే మురిసిపోయే తల్లిదండ్రులు, అనారోగ్యంతో ఆడపిల్ల ఇంటికి చేరితే కొండంత దిగులు పడిపోతారు. అలా కాళ్ళ మీద గుడ్డలుతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే, ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో మురికి నీటిని దూరంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందని పెద్దలు అలా చెబుతుంటారు...

అందుకే అంటారు ఇల్లాలి ఆనందం, ఆరోగ్యం ఇంటికి వెలుగని.


More Mysteries - Miracles