పూజలు ఫలించాలంటే మాంసాహారం తినకూడదా
మనం తీసుకునే ఆహారం మనలో రకరకాల గుణాలకు శాఖాహారం సత్వగుణానికి దోహదపడుతుంది. శాఖాహారం తినటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి, చిత్తశుద్ధి పెరగడానికి శాఖాహారం ఉపకరిస్తుంది. మాంసాహారం ఆయుష్షుని హరిస్తుంది. శాఖాహారం, మాంసాహారం తినే వారిని పరిశీలిస్తే శాఖాహారం తీసుకునే వారికి ఆయుష్షుతో ఎక్కువ కాలం ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పవిత్ర దినములలో భగవంతునిపై మనసు లగ్నం చేయడం వల్ల పుణ్యం గడించవచ్చు.అలా కాకుండా మాంసాహారం తీసుకుంటే మనసు రాక్షస ప్రవృతికి మళ్లి చెడు కార్యాలు చేయవచ్చు.అందుకే పండుగ సమయాల్లో, శుభకార్యాల్లో మాంసహారాన్ని త్యజిస్తుంటారు. పుణ్యక్షేత్రాలలో కూడా మాంసాహారం భుజించకూడదు అనడానికి కారణం ఇదే.