శివ అక్షరమాల స్తోత్రం

 

Information on Powerful Lord Shiva Aksharamala Stotram in Telugu

 

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ  (2) | సాంబ |      
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ            (2) | సాంబ |
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ        (2) | సాంబ |    
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ             (2) | సాంబ |

ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ           (2) | సాంబ |             
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ             (2) | సాంబ |     
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ       (2) | సాంబ |     
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ       (2) | సాంబ |

లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ    (2) | సాంబ |            
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ          (2) | సాంబ |             
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ         (2) | సాంబ |   
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ      (2) | సాంబ |

ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ          (2) | సాంబ |
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ                (2) | సాంబ |
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ      (2) | సాంబ |
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ                (2) | సాంబ |

 

Information on Powerful Lord Shiva Aksharamala Stotram in Telugu

 

కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ            (2) | సాంబ |
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ      (2) | సాంబ |
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ           (2) | సాంబ |       
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ               (2) | సాంబ |
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ         (2) | సాంబ |

చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ      (2) | సాంబ | 
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ            (2) | సాంబ |    
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ         (2) | సాంబ |      
ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ          (2) | సాంబ |     
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ               (2) | సాంబ |

టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ           (2) | సాంబ |    
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ                (2) | సాంబ |
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ          (2) | సాంబ |
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ       (2) | సాంబ |
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ  (2) | సాంబ |

తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ      (2) | సాంబ |      
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ     (2) | సాంబ |          
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ        (2) | సాంబ |
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ       (2) | సాంబ |           
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ      (2) | సాంబ |

పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ        (2) | సాంబ |            
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ       (2) | సాంబ |           
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ         (2) | సాంబ |          
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ        (2) | సాంబ |
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ       (2) | సాంబ |       

యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ  (2) | సాంబ |
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ    (2) | సాంబ |
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ            (2) | సాంబ |  
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ       (2) | సాంబ |

శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ   (2) | సాంబ |
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ      (2) | సాంబ |       
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ      (2) | సాంబ |              
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ    (2) | సాంబ |     
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ                 (2) | సాంబ |
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ      (2) | సాంబ |

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||


More Siva Stotralu