శనిదోషం ఉన్నవారు శనివారం ఈ పనులు చేస్తే మంచిది..!

 

 

హిందూ మతంలో దేవుడిని నమ్మేవారు, గ్రహాలను, గ్రహాల ప్రభావాన్ని కూడా గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా గ్రహాలన్నింటిలోకి  శని గ్రహం అంటే భయపడతారు.  శని దేవుడి చూపు సోకితే ఎక్కడలేని కష్టాలు ఆ వ్యక్తి జీవితంలో ఉంటాయని అంటుంటారు. ఎవరైనా విపరీతమైన కష్టాలు ఎదుర్కుంటున్నా, ఎంత ప్రయత్నం చేసినా చేసే పనులలో ఫలితం దక్కకపోయినా, విడవకుండా అపజయాలు ఎదురవుతున్నా శని పట్టుకుంది అంటూ ఉంటారు. నిజానికి శని దేవుడు ఎవరికీ అకారణంగా చెడు చేయడు. మనిషి చేసిన కర్మలకు సరైన  ఫలితాన్ని, మనిషికి సరైన తీర్పను ఇచ్చేవాడు న్యాయ దేవుడు  శనిదేవుడే.  అయితే శని దేవుడిని కూడా ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి జీవితంలో కష్టాల నుండి ఊరట లభిస్తుంది.  ఇందుకోసం  శనివారం రోజు ఈ కింద చెప్పినట్టు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.


వారంలో శనివారం శనిదేవునికి ప్రత్యేకమైనది.  ఈరోజు శనిదేవుడిని పూజించడం వల్ల శని దేవుడి వల్ల కలిగే బాధలు తగ్గుతాయి. కష్టాల నుండి ఊరట లభిస్తుంది. శనిదేవుడు కుంభం, మకరం రాశులను పరిపాలింటే గ్రహం.  ఈ రాశి వారికి ఆయన ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.  అయితే  శనిదోషం ఉంటే మిగిలిన ఈ రాశులకే కాదు, మిగిలిన రాశులకు కూడా   జీవితంలో సంక్షోభం ఎదురవుతుంది.  శనిదోషం నివారణకు శనివారం రోజు శనిదేవుడిని ఎలా పూజించాలంటే..


శని దేవుడిని ఆరాధించడానికి శనివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. శనిదేవుని ఆలయానికి లేదా నవగ్రాహాలు ఉన్న గుడికి  వెళ్లి శనిదేవుని  విగ్రహం దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించాలి.  ఈ సమయంలో శనిదేవునికి  నీలం రంగు పువ్వులు, నల్ల ఉసిరి, నల్ల గుడ్డ, నల్ల నువ్వులు సమర్పించాలి. తర్వాత  ఆవాల నూనెను శనిదేవుని మీద అభిషేకంలా వేయాలి.  ఇవన్నీ చేసిన తరువాత నల్ల తులసి జపమాలతో 'ఓం శం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.  జపం తరువాత శనిదేవుడికి  హారతి  ఇచ్చి పూజ ముగించాలి.  


ఇలా చేస్తే శనిదోషం నుండి ఉపశమనం కలుగుతుంది.  శని దేవుని అనుగ్రహం కలిగి జీవితంలో ఇబ్బందుల నుండి ఊరట లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా శనివారం రోజు హనుమంతుడిని పూజించడం వల్ల కూడా శనిదేవుడు  శాంతిస్తాడు. శనిదేవుని గాయత్రి మంత్రం,  శనిదేవుని ప్రధాన మంత్రం,  శనిదేవుని బీజ మంత్రం,  శని స్త్రోత్రం వంటివి పఠిస్తూ ఉంటే శని బాధల నుండి ఉపశమనం ఉంటుంది.


         *రూపశ్రీ.
 


More Hanuman