మార్గశిర మాసంలో ఏ పనులు చెయ్యాలి? ఏ పనులు చెయ్యకూడదు!
తెలుగు మాసాలలో కార్తీకం తరువాత మార్గశిరమాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో కొన్ని చెయ్యాల్సిన పనులు, మరికొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోకుండా ఏ పనులైనా చేస్తే ఆ తరువాత శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. వీటి గురించి తెలుసుకుంటే..
ఈ మాసంలో జనవరి 15వ తేదీ వరకు అంటే మకర సంక్రాంతి వరకు ఖర్మాలు ఉంటాయి. ఈ రోజులను చెడ్డ రోజులుగా భావిస్తారు. ఈ రోజులలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున చేసినా వాటి వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయని అంటారు. ముఖ్యంగా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి అయిన వివాహం లాంటి కార్యక్రమాలు ఈ రోజుల్లో చేయకూడదు. ఇలాంటి కార్యాలు చేసే ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని చెబుతారు.
ఈ రోజుల్లో ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానిక వెచ్చదనాన్ని ఇచ్చే బెల్లం, లవంగాలు, ఆకుకూరలు, నువ్వులు వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవి శరీరంలో వేడి పుట్టించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కాలంలో కారం ఎక్కువగా తినడం మానేయాలి. అలాగే వేయించిన ఆహారాలు, అధిక ఉప్పుకు దూరంగా ఉండాలి.
ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడిని పూజిస్తారు. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలామంచిది. ఇలాంటి వారికి వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు చక్కబడతాయి. ఈ మాసంలో వీలైనంత వరకు ఎరుపు, పసుపు వువ్వులు పూజకు వినియోగించడం మంచిది.
మార్గశిర మాసంలో నెయ్యి, కందిపప్పు, బియ్యం దానం చేయడం చాలా శుభప్రదం. ఇలా దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే ప్రతి ఆదివారం వ్రతం పాటించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇంటికి సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం అన్ని సమకూరుతాయి.
*నిశ్శబ్ద.