రుద్రాక్ష గురించి ఏమి తెలియకుండా వేసుకుంటున్నారా...?

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా రుద్రాక్షల గురించి రుద్రాక్ష వైభవం శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి వివరించిన మర్ని విశేషాలు మీ తెలీయాలంటే ఈ వీడియోను చూడండి

 


More Enduku-Emiti