జీవితం నుండి దరిద్రాన్ని పారద్రోలాలి అంటే.. మార్గశిర పౌర్ణమి రోజు  ఈ పనులు చేయండి..!

 


జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా.. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోతున్నా,  ఆర్థికంగా నష్టం కలుగుతున్నా..  సమస్యలు ఒకదాని తరువాత ఒకటి చుట్టు ముడుతున్నా అలాంటి సందర్భాలలో దరిద్రం చుట్టుకుంది అని అంటుంటారు.  అయితే జీవితంలో ఏర్పడిన ఇలాంటి పరిస్థితిని వదిలించుకోవాలంటే దైవిక శక్తులు ఎక్కువగా ఉన్న రోజుల్లో కొన్ని ప్రత్యేక పనులు చేపట్టాలి. అలాంటి శక్తివంతమైన రోజులలో పౌర్ణమి కూడా ఒకటి.  ఈ రోజు కొన్ని పనులు చేయడం ద్వారా దరిద్రాన్ని వదిలించుకోవచ్చట.


డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి వచ్చింది.  ఈ రోజు మధ్యాహ్నం 4గంటల తరువాత నుండి పౌర్ణమి తిథి ప్రారంభం అవుతుంది. ఇది 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది.  పౌర్ణమి  సూర్యాస్తమయం తరువాత వచ్చేది కాబట్టి పౌర్ణమి 15వ తేదీ అవుతుంది. ఈ రోజు కొన్ని పనులు చేయడం వల్ల  జీవితంలో ఇబ్బందులను తరిమికొట్టవచ్చు.

  తామసిక ఆహారం..

పౌర్ణమి రోజు తామసిక ఆహారం తీసుకోకూడదు.  మాంసం, ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.  ఇలాంటివి ఆహారంలో తీసుకుని పూజ చేసినా తగిన ఫలితం ఉండదని అంటున్నారు.

జుట్టు, గోర్లు..

పౌర్ణమి రోజు జుట్టు, గోర్లు వంటివి కత్తిరించడం మచిది కాదట. ఇలా చేస్తే ఏ పనులు తలపెట్టినా వాటిలో ఎదుగుదల ఉండదని అంటారు. అందుకే ఈ రోజు ఇలాంటి పనులు చేయకూడదు.

అవమానం..

పౌర్ణమి రోజు పెద్దలను కానీ, ఇతరులను కానీ అకారణంగా అవమానించడం మంచిది కాదట. అదే విధంగా కుటుంబంలో ఎవరితోనూ గొడవలు పడటం కూడా మంచిది కాదు. ఇది ఇంట్లో ఇబ్బందులను సృష్టిస్తుంది. ఇలాంటివి దీర్ఘకాలం అందరినీ అనోన్యంగా ఉండకుండా ఎడముఖం,  పెడ ముఖం పెట్టుకుని ఉండేలా చేస్తాయి.

స్నానం..

పౌర్ణమి రోజు నదీ స్నానం లేదా సముద్ర స్నానం లేదా సముద్ర స్నానం చేయడం మంచిది.  ఇలా స్నానం చేసిన తరువాత పేదలకు అన్నదానం  చేయడం,  అవసరమైన వస్తువులను దానం చేయడం మంచిది. ఇవన్నీ చేస్తుంటే జీవితంలో దరిద్రం తొలగిపోయి మంచి కాలం మొదలవుతుందట.


                                              *రూపశ్రీ.
 


More Aacharalu